క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం తమ రోజువారీ పనులను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

Sushmita sen and Rohman shawl

తాజాగా బాలీవుడ్ న‌టి సుస్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసిన వర్క్ అవుట్ ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సుష్మిత షేర్ చేసిన వీడియోలో బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కలిసి చాలా శ్రద్ధగా వివిధ భంగిమల్లో యోగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్ నేపధ్యంలో సుష్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్, ఇద్దరు కుమార్తెలతో పాటు ఇంట్లోనే ఉంటోంది. 44 ఏళ్ల సుష్మితా సేన్ 28 ఏళ్ల తన ప్రియుడు రోహ్మాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Sushmita sen and Rohman shawl

ఈ పోటోల్లో వారిద్ద‌రూ హాట్ హాట్ ఫోజుల‌తో మ‌తిపోగొట్టేశారు. అక్కడితో ఆగకుండా ‘కష్టకాలం ఎప్పటికీ ఉండదు. ఈ సమయంలో బలంగా ఉన్నవారే ఈ విపత్తును దాటగలరు’ అంటూ తనదైన వేదాంతాన్ని చెప్పింది. ‘ఈ సమయంలో ప్రజలందనూ మానసికంగా శారీరకంగా ధృడంగా తయారు కావాలంటూ’ పిలుపునిచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ లేటు వయసు భామ ఘాటు రిలేషన్కు కుర్రాడు కరెక్ట్గా సూట్ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.