ఒక‌మ్మాయి.. ఇద్ద‌రు అబ్బాయిలు.. ఎన్నో ట్విస్టులు.. చివ‌రికి..

ఆ వయసులో ప్రేయకు ఆక్షర్షణకు తేడా తెలీదు. ఆ యువతి వేసిన ఓ తప్పటడుగు ఆమె జీవితాన్నే బలి తీసుకుంది. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో చేసిన నయవంచనను తట్టుకోలేక యువతి విషం తాగి ఆత్మహత్యకు చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివమొగ్గ పట్టణ శివారులోని గొందిచట్నహళ్లి గ్రామానికి చెందిన సుప్రియ (19) ఓ ప్రైవేటు కాలేజీలో పీయూసీ సెకండియర్ చదువుతోంది. కొంత కాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన సాగర్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కాగా సుప్రియ కుటుంబం ఆర్థికంగా ఉన్నతమైంది. దీంతో సుప్రియ ఆస్తిపై కన్నేసిన సాగర్‌.. ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్‌ వేశాడు.

ఆయువతికి బాగా దగ్గరై ఆమెను ప్రేమ పేరుతో సన్నిహితంగా గడిపేవాడు. ఆ సమయంలో యువతికి తెలియకుండా ఫోటోలు, వీడియాలు తీసుకున్నాడు. కొద్ది రోజుల తరువాత నుంచి సుప్రియ ను వేధించడం మొదలు పెట్టాడు. తాను చెప్పినట్లు వినకుంటే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడు. చేసేది ఏమిలేక ఆ యువతి అతను చెప్పినట్లు చేసేది. అతను అడిగింత నగదును ఇచ్చేది. అలా లక్షల్లో నగదుతో పాటు బంగారాన్ని దోచుకున్నాడు. అయితే ఓ రోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో.. ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో అతని పీడ విరగడైందని సుప్రియ సంతోషించింది.

ఆ సంతోష సమయంలో ఆమె చేసిన పొరపాటు ఆమె జీవితాన్ని అగాతంలోకి తోసేసింది. సోషల్‌మీడియాలో చిత్రదుర్గ పట్టణానికి చెందిన సుబాని షరీఫ్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. తన పేరు సుబ్బు అని అబద్దం చెప్పి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు వీడియోలు తీశాడు. అనంతరం ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. షరీప్‌ కు ఆమె లక్షల్లో డబ్బు సమర్పించుకుంది. విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో సుబ్బుతో మాట్లాడి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొద్ది రోజులు సక్రమంగా ఉన్న అతను డబ్బు మీద ఆశతో మళ్లీ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో మనస్తాపానికి చెందిన సుప్రియ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివమొగ్గలో తచ్చాడుతున్న షరీప్‌ ను గుర్తించిన సుప్రియ బంధువులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు సాగర్‌ కూడా అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్