ఐదుగురు అమ్మాయిలను నగ్నంగా నిలబెట్టి..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కూడా కొందరు మూఢనమ్మకాల పిచ్చిలో దొంగస్వాములకు బలవుతున్నారు. మీ కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని.. అమ్మాయి ప్రాణం పోతుందని నమ్మించి వాళ్ల ఐదుగురు కూతుళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడో దొంగబాబా. పూజ పేరుతో ఓ అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పింప్రి చించ్వాడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌గడ్ జిల్లా రోహా ప్రాంతానికి చెందిన సోమ్‌నాధ్ కైలాష్ చౌహాన్ తనకు తాను బాబాగా ప్రకటించుకున్నాడు. మాయమాటలు చెబుతూ ఓ కుటుంబాన్ని నమ్మించాడు. తరుచూ పూజల పేరుతో వాళ్లింటికి వెళ్లేవాడు. ఈక్రమంలో ఆ కుటుంబంలోని ఐదుగురు అమ్మాయిలపై కన్నేశాడు. మీ కుటుంబానికి శాపం ఉందని.. ఎవరో చేతబడి చేశారని భయపెట్టాడు. అందుకోసం తాను ప్రత్యేక పూజలు చేస్తానని నమ్మబలికాడు. స్వామీజీని పెళ్లి చేసుకుని ఓ పూజ చేయాలని ఆ తరువాత ఆమె దోషం పోతుందని సెలవిచ్చాడు.

దీనికి ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో.. ఐదుగురు అమ్మాయిల(నలుగురు మైనర్లు)ను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అందరి బట్టలు విప్పేయించి నగ్నంగా నిలబెట్టాడు. పూజలు చేస్తున్నట్లు నటించి ఏవేవో మంత్రాలు చదువుతూ.. అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ తెల్లని వస్త్రం పరిచి ఓ యువతిని దానిపై పడుకోమని చెప్పి అఘాయిత్యానికి పాల్పడేవాడు. అలా చాలా రోజులు పాటు చేశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే.. కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించేవాడు.

తనకు అతీత శక్తులు ఉన్నాయనీ.. మీరు ఈ విషయం బయటకి చెప్పితే వెంటనే చనిపోతారని హెచ్చరించేవాడు. దీంతో ఆ ఐదుగురు అమ్మాయిలు చాలా ఈ విషయం ఎవరికి చెప్పలేదు. రోజు రోజుకు వేదింపులు ఎక్కువ కావడంతో.. భరించలేకపోయిన ఓ యువతి నోరు విప్పింది. దీంతో దొంగబాబా గారి గుట్టు రట్టైంది. దీంతో పోలీసులు దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్