ముఖ్యాంశాలు

  • బిగ్‌బాష్ లీగ్‌లో సరికొత్త రికార్డ్
  • ఒకే ఓవ‌ర్లో 5 సిక్స్ లు

ఆస్ట్రేలియా మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరికొత్త రికార్డ్ నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకి చెందిన ఓపెనర్ షోపీ డివైన్ భారీ షాట్లతో విరుచుకుపడింది. ఒక ఓవర్‌లోనే వరుసగా ఐదు సిక్సర్లు సాధించింది. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంత‌రం నిర్ణీత 20ఓవ‌ర్ల‌లో మెల్‌బోర్న్ స్టార్స్ 147/8కే పరిమితమైంది.

తొలుత‌ బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 19 ఓవర్లు ముగిసే సమయానికి 133/4తో నిలవగా.. ఓపెనర్ డివైన్ 51 బంతుల్లో 55 పరుగులు చేసి క్రీజులో ఉంది. దీంతో.. మెల్‌బోర్న్ టీమ్ కెప్టెన్ ఆఖరి ఓవర్‌ని స్పిన్నర్ మెడిలైన్ పెన్నాతో వేయించింది. కానీ.. ఆ నిర్ణయమే ఆ జట్టుకి మ్యాచ్‌ని దూరం చేసింది.

చివరి ఓవర్‌ తొలి‌ బంతికి కైట్ (5 నాటౌట్) సింగిల్ తీసింది. ఆ తర్వాత ఐదు బంతుల్నీ ఆడిన డివైన్ వరుసగా 6, 6, 6, 6, 6 బాదేసింది. రెండో బంతిని మిడ్‌వికెట్ దిశగా.. ఆ తర్వాత బంతిని క్రీజు వెలుపలికి వచ్చి లాంగాన్‌లోకి.. ఇక మూడో బంతిని మళ్లీ డీప్‌మిడ్‌ వికెట్ దిశగా.. చివరి రెండు బంతుల్నీ లాంగాన్ దిశగా సిక్సర్లుగా మలిచింది. మొత్తంగా చివ‌రి ఓవర్‌లో 31 పరుగుల్ని పిండుకుంది. ఓపెనర్ షోపీ డివైన్ (85, 56 బంతుల్లో 6×4, 5×6) నాటౌట్ గా నిలిచింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

6 comments on "టీ20 ఆఖ‌రి ఓవ‌ర్లో విరుచుకుప‌డ్డ ఓపెన‌ర్.. వ‌రుస‌గా 6, 6, 6, 6, 6"

Comments are closed.