అక్ర‌మ సంబంధాల మోజులో ప‌డి ప‌చ్చ‌ని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. తండ్రి మ‌రో మ‌హిళ‌తో అపైర్ పెట్టుకున్నాడు. కుటుంబాన్ని ప‌ట్టించుకోకుండా ఆమె మ‌హిళ వ‌ద్దే ఎక్కువ స‌మ‌యం ఉండేవాడు. దీంతో భార్య‌, భ‌ర్త‌ల మధ్య నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. తండ్రి త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డానికి కార‌ణం ఆ మ‌హిళ‌నేన‌ని 14 ఏళ్ల బాలుడు భావించాడు. త‌మ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింద‌న్న కోపంతో తండ్రి ప్రియురాలిని చంపేశాడు. ఈ ఘ‌టన త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది.

పట్టుకోట్టై సమీపంలోని ఓగ్రామానికి చెందిన వ్యక్తికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 14ఏళ్ల కొడుకు ఉన్నాడు. కాగా ఇటీవ‌ల ఆ వ్య‌క్తి మ‌రో మ‌హిళ‌తో అపైర్ పెట్టుకున్నాడు. దీంతో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఇదే విష‌యమై రోజు గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. తండ్రి అలా చేయ‌డం కొడుకు న‌చ్చ‌లేదు. అమ్మానాన్నల మధ్య మధ్య గొడవలు రావడానికి తండ్రి ప్రియురాలే కారణమని ఆ బాలుడు కక్ష పెంచుకున్నాడు.

తన ఫ్రెండ్‌తో కలిసి సోమ‌వారం తండ్రి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తన తండ్రితో సంబంధం వ‌దులుకోవాల‌ని హెచ్చ‌రించాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఆగ్ర‌హానికి లోనైన ఆ బాలుడు ప‌క్క‌నే ఉన్న క‌ర్ర‌తో ఆమె త‌ల‌పై బ‌లంగా కొట్టి.. అక్క‌డి నుంచి పారిపోయాడు. తీవ్ర ర‌క్త‌స్రావం అవుతున్న ఆ మ‌హిళ‌ను స్థానికులు ఆస్ప‌త్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ.. మంగ‌ళ‌వారం మృతి చెందింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు బాలుడితో పాటు అతడి ఫ్రెండ్‌ని అరెస్ట్ చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.