ఫిర్యాది మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం.. ఆమె తల్లితో కూడా..

హైదరాబాద్‌: పంటను కాపాడాల్సిన కంచె.. చెను మేసిందంటే ఇదేనోమో. కాపాడాల్సిన పోలీసే.. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం.. అంతకుమించి కూడా చేయడం ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది. ఫిర్యాది మహిళతోనే విహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్సై చీకటి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొన్ని సంవత్సరాల కిందట ఓ మహిళ మాదాపూర్‌ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళతో అక్కడే ఉన్న ఎస్సై మాట్లాడుతూ.. మీకేం ఫర్వాలేదు.. సాయం చేస్తానంటూ హామీ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత కేసు దర్యాప్తు విషయమై రోజు ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఎస్సై చేస్తున్న హడవిడిని చూసి ఆమె నిజమేనని నమ్మింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చనువు పెరిగింది. రూ.5 లక్షల వరకు డబ్బును ఆ ఫిర్యాది మహిళ.. ఎస్సైకి ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఎస్సై తరచూ ఇంటికి మహిళ వస్తుండేవాడు. పెరిగిన చనువుతో విహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కేసు దర్యాప్తు కోసం తరచూ ఇంటికి వస్తున్న ఎస్సై.. ఆ ఫిర్యాది మహిళ తల్లితో కూడా విహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. ఆ ఎస్సై పని చేస్తున్న పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేసింది. చివరికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఎస్సై అధికారి పలుకుబడితో కేసును పక్కకు పెట్టేశారు.

కొన్ని రోజులకు ఆ ఎస్సై వేరే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. దిశ హత్యాచార ఘటన తర్వాత మహిళల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని ఆ మహిళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆ ఎస్సై చర్యల దిశగా విచారణ జరుగుతోందని తెలుస్తోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.