విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచక అవతారమెత్తాడు. తన దగ్గర చదువుకున్న విద్యార్థినితో కామక్రీడలకు పాల్పడుతూ.. వాటిని సెల్‌ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. వాటిని ఆ విద్యార్థినికి పంపబోయి వేరే నంబర్‌కు పంపాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలుకా రాంపుర గ్రామంలో గవర్నమెంట్ హైస్కూల్లో సిద్ధరాజు అలియాస్ సిద్ధరామయ్య అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. స్కూల్‌లోని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. అయితే తనకున్న పలుకుబడితో తన ఉద్యోగాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. గతంలో తన వద్ద చదువకున్న ఓ విద్యార్థిని(20)ని మభ్యపెట్టి వాంఛలు తీర్చుకునేవాడు. కొద్దిరోజులు గుట్టచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ కామకలాపాలు అతడి పొరపాటు వల్లే బయటపడ్డాయి. వారిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలను యువతి వాట్సప్‌కు పంపాడు. అయితే.. అవి పొరపాటున గ్రామంలో ఉండే మరో వ్యక్తికి సెండ్ చేశాడు.

సదురు వ్యక్తి వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. దీంతో గ్రామం మొత్తం కామ క్రీడల పోటోలు వైరల్ గా మారాయి. సిద్ధరాజు నిజస్వరూపం గురించి తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం స్కూల్ ఎదుట ధర్నా చేపట్టారు. జనాలకు దొరికితే.. తనకు బడితపూజ ఖాయం అనుకున్న ఆ ఉపాధ్యాయుడు స్కూల్ వెనక గేటు నుంచి పరారయ్యాడు. గత కొంత కాలంగా ధనుర్వాతంతో బాధపడుతున్నప్పటికి యువతిని తరుచూ ఇంటికి రప్పించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న అతన్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.