కీచక స్కూల్‌ ప్రిన్సిపాల్‌.. టీచర్‌తో యవ్వారాలు..

హైదరాబాద్‌: ఓ స్కూల్‌లో టీచర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాన్న ఆరోపణలపై ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పాడు పనులు చేస్తూ గురువు అనే పదానికే మచ్చ తెచ్చాడు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్‌ దారి తప్పాడు.. తనతో పని చేస్తున్న టీచర్‌పై కన్నేశాడు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ.. తోటి టీచర్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

జూబ్లీహిల్స్‌ పరిధిలోని ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా సయీద్‌ అయుబ్‌ పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో స్కూల్‌లో పని చేస్తున్న టీచర్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. మాయ మాటలతో నమ్మించి లొంగదీసుకున్నాడు. ప్రిన్సిపాల్‌ మాటలు నమ్మిన ఆ టీచర్‌.. అతడు చెప్పినట్లు చేసింది. ఓ రోజు ఆయుబ్‌.. టీచర్‌ను బయటకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెకు కూల్‌ డ్రింక్‌లో మత్త మందు కలిపి తాగించాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న టీచర్‌.. అతడిని నిలదీసింది.

టీచర్‌ను బెదిరించి ఆయుబ్‌ వివాహం చేసుకున్నాడు. తాను చెప్పినట్లు వినాలని లేదంటే.. అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. దీంతో ఆ అమాయక టీచర్‌.. అతడిని వివాహం చేసుకుంది. ఈ విషయం కాస్త టీచర్‌ తల్లిదండ్రులకు తెలియడంతో వారు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఆయుబ్‌ మాట్లాడుతూ.. తాను మీ కూతురును రెండో భార్యగా చూసుకుంటానని టీచర్‌ తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో టీచర్‌ బంధువులు స్కూల్‌పై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే తనను నమ్మించి మోసం చేసి ప్రిన్సిపాల్‌ అత్యాచారం చేశాడని టీచర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయుబ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *