కోరిక తీర్చాలంటూ మగాడికి వేధింపులు.. పట్టించిన పేపర్ ముక్క

తనతో అసహజ శృంగారం చేయాలని ఓ వ్యక్తి తన క్లోజ్‌ ఫ్రెండ్‌ను నిత్యం వేదించేవాడు. కొంతకాలం పాటు అతని వేధింపులు భరించిన ఆ ఫ్రెండ్ చివరకు విసిగిపోయి ఓ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రోజూ అసహ శృంగారం కోసం అర్రులు చాస్తున్న స్నేహితుడి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్రణాళికతో స్నేహితుడిని గుట్టలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా పెట్రోల్‌ పోపి తగలబెట్టాడు. అయితే.. మృతుడి జేబులోని ఓ పేపర్‌ ముక్క నిందితుడిని పట్టించింది.

ఉత్తరప్రదేశ్‌కి చెందిన బందు నిరంజన్ ఇంగిల్, వీరేంద్రకుమార్ రామ్‌మిలాన్ సింగ్ ప్రాణస్నేహితులు. ఉపాధి కోసం పూణెకు సమీపంలోని వడ్గావ్ బడ్రక్‌ పరిధిలో ఉన్న సిన్హాగడ్ కాలేజీలో కూలీలుగా పనికి కుదిరారు. ఈ క్రమంలో ఒకే గదిలో ఉండేవారు. నిరంజన్‌.. తన స్నేహితుడు వీరేంద్రకుమార్‌ని లైంగికంగా వేధించేవాడు. అసహజ శృంగారం కోసం పట్టుపట్టేవాడు.

లైంగిక సుఖం ఇవ్వాలని వేధింపులకు గురిచేసేవాడు. ఇదీ తప్పని.. మగాడు మగాడు తో ఇవేం పనులు అని వీరేంద్రకుమార్‌ ఎంత నచ్చచెప్పినా కూడా నిరంజన్‌ ఇంగిల్ వినేవాడు కాదు. దీంతో కొద్దికాలం మౌనంగా భరించాడు వీరేందర్‌. చివరికి విసిగిపోయాడు.

‘గే’ స్నేహితుడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో అతన్ని అంతమొందిచాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పక్కా ప్రణాళికను రూపొందించాడు. స్నేహితుడిని నమ్మించి దూరంగా ఉన్న ఓ క్వారీ కొండ వద్దకు తీసుకెళ్లాడు. అదును చూసి ఓ బండరాయితో తలపై మోదాడు. అనంతరం బీర్‌ బాటిల్‌ సీసాను పగలకొట్టి పొడిచేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నిరంజన్‌ ఇంగిల్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. ముందుగా అనుకున్న ప్రకారం వీరేంద్ర.. తన స్నేహితుడి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శరీరం గుర్తు పట్టలేనంతగా కాలిపోయాక అక్కడి నుంచి పరారయ్యాడు.

క్వారీ కొండల్లో మంటల్లో కాలిపోయిన శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని అణువణువూ జల్లెడ పట్టారు. అయినా.. కానీ హత్యకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. మృతదేహాం కాలిపోయి ఉండడంతో మృతుడు ఎవరు అనే వివరాలు కూడా లభించలేదు. మృతుడి జేబులో ఓ పేపర్ కనిపించింది. అది ఆస్పత్రిలో తీయించుకున్న ఈసీజీ రిపోర్ట్.

దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించి.. ఎట్టకేలకు హత్యకు గురైంది బందు నిరంజన్ ఇంగిల్ అని గుర్తించారు. అతనితో ఉన్న వ్యక్తి నిరంజన్ క్లోజ్ ఫ్రెండ్ వీరేంద్రకుమార్‌ అని తెలుసుకున్నారు. అతన్ని పట్టుకుని తమస్టైల్‌లో విచారించారు. దీంతో మొత్తం నిజం కక్కేశాడు వీరేంద్ర. అతనిని గాలించి పట్టుకున్నారు. తమ స్టైల్లో విచారించడంతో వీరేంద్ర అసలు విషయం కక్కేశాడు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *