ఓ బాలిక 11వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. చివ‌రి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతోంది. కడుపునొప్పి రావ‌డంతో బాత్రూమ్‌కి వెళ్లింది. ఎంత సేప‌టికి తిరిగి రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన టీచ‌ర్ బాత్రూమ్‌లోకి వెళ్లి చూసి షాకైంది. బాలిక ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉంది. వెంట‌నే బాలిక‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ఆ బాలిక‌కు ఆప‌రేష‌న్ చేసి ఓ ఆడశిశువును బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

నామక్కల్ జిల్లాలోని నామగిరిపెట్టై ప్రాంతానికి చెందిన ఓ బాలిక స్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది. ఆ బాలిక తండ్రి అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం మ‌ర‌ణించాడు. త‌ల్లీ కూలీ ప‌నులు చేసుకుంటూ కుమారైను పోషించుకుంటుంది. ఆ బాలిక ఇంటి ప‌క్క‌న వీర‌న్‌(70) అనే వృద్దుడు నివ‌సించేవాడు. అత‌డి క‌న్ను బాలిక పై ప‌డింది. బాలిక‌కు మామ మాట‌లు చెప్పి త‌న ప‌శువాంఛ‌ను తీర్చుకునేవాడు. ఈ క్ర‌మంలో బాలిక గ‌ర్భం దాల్చింది.

ఏడాది చివరి పరీక్షలకు బాలిక హాజరవుతుతోంది. ఓ రోజు ప‌రీక్ష హాలులో ఉండ‌గా.. బాలిక‌కు క‌డుపు నొప్పి వ‌చ్చింది. బాత్రూమ్‌కి అని చెప్పి వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన టీచర్ బాత్రూమ్‌కి వెళ్లి చూసి షాక్‌కి గురైంది. బాలిక రక్తపు మడుగులో పడి ఉండడంతో కంగారు పడి ప్రధానోపాధ్యాయురాలికి విషయం చెప్పింది. తక్షణం స్పందించిన హెచ్‌ఎం బాలికను సేలంలోని మోహన్ కుమారమంగళం ఆస్పత్రికి తరలించింది. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఎనిమిది నెలల గర్భంతో ఉందని చెప్పడంతో అంద‌రూ నిర్ఘాంతపోయారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆసరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలికను ఆరా తీయడంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి వీరన్ దారుణానికి ఒడిగట్టు తేలింది. దీంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.