ఒకే కాన్పులో ముగ్గురు, న‌లుగురు పిల్ల‌లు జ‌న్మించార‌నే వార్త‌లు విని మ‌నం ఆశ్చ‌ర్య‌పోతుంటాం. అయితే.. ద‌క్షిణాఫ్రికాకు చెందిన‌ ఓమ‌హిళ‌ ఒకే కాన్పులో 10 మంది పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి ప్ర‌పంచ రికార్డు సృష్టించింది. అయితే.. కాన్పుకు ముందు ఈ విష‌యం తెలియ‌ద‌ని, డాక్ట‌ర్లు తీసిన స్కానింగ్ రిపోర్టుల్లో మొద‌ట ఆరుగురు పిల్ల‌లు పుడ‌తార‌ని చెప్పార‌ని, ఆ త‌రువాత మ‌ళ్లీ తీసిన స్కానింగ్‌ల ద్వారా 8 మంది పిల్ల‌లు పుడ‌తార‌ని చెప్పార‌న్నారు. డాక్ట‌ర్లు చెప్పిన దాని కంటే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఎక్కువ‌గానే జ‌న్మ‌నివ్వ‌డం గ‌మ‌నార్హం.

ఒకే కాన్పులో 10 మంది పిల్లలు( డెక్యూప్లెట్స్‌) జన్మించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్‌హోల్‌ (37) అనే మహిళ ప్రకటించింది. ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్‌ (సి–సెక్షన్‌) ద్వారా ప్రసవం జరిగిందని, ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. తన భార్య గర్భం దాల్చి 7 నెలల 7 రోజులైందని, నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చిందని తెలిపాడు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేగానికి గురయ్యారు.

అయితే ఒకే కాన్పులో 10 జన్మించారని దంపతులు చెబుతున్న విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుందని చెబుతున్నారు. కృత్రిమ గర్భధారణ కోసం చేసే ట్రీట్‌మెంట్ల వల్లే ఇలా ఎక్కువ మంది శిశుశులు జన్మిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి ఫలదీకరణ చెందిన అండాలను ఎక్కువ మొత్తంలో మహిళల గర్భాశయంలో ప్రవేశపెడుతుంటారని, అవి సక్రమంగా పెరిగి, ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని అంటున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story