వెంకన్న లడ్డు ధరను పెంచే ఆలోచన లేదు..!:వై.వి.సుబ్బారెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2019 5:09 PM IST
వెంకన్న లడ్డు ధరను పెంచే ఆలోచన లేదు..!:వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల: ఇటీవల శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెరిగాయంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. లడ్డు ధరలను పెంచలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

తిరుమల లడ్డు ధర పెంచే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ లేదన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.

Next Story