కట్టుకున్న భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి..రోజూ ఉదయాన్నే లేచాక భర్త కాళ్లకు నమస్కారం చేసే రోజులు పోయాయి. భర్త మీద ఏ మాత్రం అనుమానం వచ్చినా తాట తీస్తున్నారు భార్యలు..కొందరైతే తమ ప్రియులతో గడపడానికి సమయం కుదరడం లేదని ఏకంగా చంపేస్తున్నారు కూడా..అలాంటి ఘటనే గతనెల 20వ తేదీన నెల్లూరులో వెలుగుచూసింది. మొదట మిస్టరీగా ఉన్న ఈ కేసులో అసలు దోషులను పోలీసులు ఎలా పట్టుకున్నారో మీరూ..తెలుసుకోండి.

గత నెల 20వ తేదీన నెల్లూరు జిల్లాలోని కొత్తూరు ఫైరింగ్ రేంజ్ వద్ద తుప్పల వైపుగా వెళ్తున్న ఓ వ్యక్తికి కూతవేటు దూరంలో ఏదో నల్లగా..కాలినట్లు ఉన్న ఆకారాన్ని చూశాడు. మొదట ఎవరో అడవిపందిని కాల్చారనుకున్నాడు. కాస్త దగ్గరికివెళ్లి చూసేసరికి అదొక మనిషి మృతదేహం. కాలి, ఎండి, భయంకరంగా ఉంది ఆ శవం. అక్కడ ఉండలేక కాస్త పక్కకి వచ్చి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. గంటలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించగా..అది ఎవరిదో గుర్తు పట్టలేని విధంగా ఉంది. దీంతో పోలీసులు రెండు అంచనాలకు వచ్చారు.

1.డెడ్ బాడీని 10 రోజులకు ముందే ఎవరో కాల్చి చంపారని అనుకున్నారు.
2.ఆ మృతదేహం ఒక పురుషుడిది అని.
మసిబొగ్గులా ఉన్న ఆ డెడ్ బాడీ పార్ట్ లను పోస్ట్ మార్టం నిమిత్తం జిజిహెచ్ కు తరలించి కేసు నమోదు చేసుకున్నారు.

ఇక దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. మిస్సింగ్ కంప్లైంట్లు చెక్ చేశారు. జిల్లాలోని అన్ని పీఎస్ లలో 10 రోజుల క్రితం మిస్సింగ్ కంప్లైట్లపై ఎంక్వైరీ చేసినా..ఫలితం లేదు. దాంతో… రాష్ట్రంలో అప్పటికి 10 రోజుల కిందటి మిస్సింగ్ కంప్లైంట్లపై దృష్టి పెట్టారు. ఉమ్మారెడ్డిగుంటలో ఉంటున్న తన కొడుకు సూర్యనారాయణ (42) కొన్ని రోజులుగా కనిపించట్లేదని… శ్రీకాకుళానికి చెందిన సన్యాసి అనే పెద్దాయన వేదాయపాళెం పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి సూర్యనారాయణ కనిపించడం లేదని తెలుసుకున్న పోలీసులు..కాలిన డెడ్ బాడీ అతడిదే కావచ్చని భావించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. సన్యాసి డీఎన్ఏ డెడ్ బాడీకి మ్యాచ్ అవడంతో అది సూర్యనారాయణదే నని తేల్చారు.

ఎంక్వైరీ చేస్తుండగా..

సూర్యనారాయణ తండ్రి, ఇతరుల్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పోలీసులు ఓ విషయం గమనించారు. సూర్యనారాయణ భార్య భద్రమ్మపోలీసులడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూనే..మాటిమాటికీ ముక్కుపై వేలు వేసుకుంటోంది. మాటిమాటికీ ముక్కుపై వేలు వేసుకుంటోంది. దిక్కులు చూస్తూ చీరకొంగుతో చెమటలు తుడుచుకుంటోంది. ఇవన్నీ పసిగట్టిన పోలీసులు ఒక నిర్థారణకొచ్చారు. డొంక తిరుగుడు లేకుండా నిజం చెప్తే సరే..లేదంటే మరోలా విచారణ చేయాల్సి ఉంటుందని తమ స్టైల్ లో చెప్పారు. దొరికిపోయాను అనుకున్న భద్రమ్మ అసలు నిజం కక్కేసింది.

Also Read : కవల బాలికలపై మూడేళ్లుగా మేనమామ.. ఏడాది నుంచి తండ్రి అత్యాచారం..

శ్రీకాకుళం లక్ష్మీనరసుపేట మండలానికి చెందిన సూర్యనారాయణకు 20 ఏళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన భద్రమ్మతో వివాహమయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. రెండేళ్ల క్రితం పనికోసం నెల్లూరు వచ్చిన వీరు..పెద్దకూతురికి పెళ్లి చేశారు. రెండో కూతురు చదువుకుంటోంది. సంవత్సరం నుంచీ భద్రమ్మ.. సుధాకర్‌ అనే మేస్త్రీ దగ్గర పనిచేస్తోంది. ఆ మేస్త్రీ ఆమెకు దగ్గరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్యనారాయణ ఈ వయసులో నీకు ఇదేం బుద్ధి అని కోపడ్డాడు. మరోసారి ఇలా జరిగిందని తెలిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయినా భద్రమ్మ ప్రవర్తనలో మార్పు లేదు. అవతలి మేస్త్రీ ఆమెను వదల్లేదు. రెండోసారి ఫిబ్రవరి 11న మళ్లీ గొడవైంది. ఈసారి లెఫ్టూ రైటూ వాయించేశాడు. అంతే… ఆమెలో అహం దెబ్బతింది. కోపం కట్టలు తెంచుకుంది. నన్నే కొడతాడా.. సంగతి చూస్తా అనుకుంది. భర్త తనపై చేయి చేసుకున్న సంగతి సుధాకర్ కి చెప్పి నువ్వేం చేస్తావో నాకు తెలీదు..ఆ చెత్త మొగుడు నాకొద్దు అని చెప్పింది. సుధాకర్ ఆమెకున్న కోపాన్ని తగ్గించాల్సిందిపోయి..మరింత రెచ్చిపోయాడు. నువ్వు చూస్తూ ఉండు..నీకు ఆ శని వదిలిస్తా అన్నాడు. అన్న మాట ప్రకారం సూర్యనారాయణను హత్య చేసి..కాల్చేశాడు. ఇప్పుడు భద్రమ్మ, సుధాకర్ లో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.