నా భర్త లాక్‌డౌన్‌ పాటించడం లేదు.. చర్యలు తీసుకోండి..!

By Newsmeter.Network  Published on  7 April 2020 9:12 AM GMT
నా భర్త లాక్‌డౌన్‌ పాటించడం లేదు.. చర్యలు తీసుకోండి..!

దేశమంతా కరోనా విజృంభిస్తుంది. రోజుకు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. టీవీల్లో, పేపర్లలో, సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కరోనా పైనే చర్చసాగుతుంది. ఎవ్వరూ బయటకు రావొద్దంటూ కేంద్ర లాక్‌డౌన్‌ విధించింది. అయినా ఆమె భర్త బైక్‌పై రోడ్లపై తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా రోడ్డెక్కుతున్నారు. భర్తను, కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం అని ఆ మహిళ భావించింది. దీంతో ధైర్యం చేసి పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కుతున్నాడని అతన్ని అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read :హాట్‌స్పాట్లపై డేగకన్ను.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలోని మువత్తుప్పుజాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో పోలీసులు పటిష్ఠ భందోబస్తు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నాడు. యువత్తుప్పజాలలో ఓ కుటుంబంలో తన భర్త ఇంటిపట్టున ఉండకుండా రోడ్డెక్కుతున్నాడు. భార్య ఎన్నిసార్లు చెప్పినా వినకపోవటంతో ఆయన బండి నెంబర్‌తో కలిపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆతన్ని స్టేషన్‌కు తరలించారు. సదరు వ్యక్తికి కౌన్సిలింగ్‌ ఇస్తే సరిపోతుందని భావించిన పోలీసులు ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని భార్యను కోరారు. కానీ ఆమె ససేమీర అనడంతో పాటు కేసు నమోదు చేయాల్సిందేనని పట్టుబట్టిందంట. నేను, కుటుంబ సభ్యులం ఎంత చెప్పినా వినని వ్యక్తిని అరెస్టు చేయాల్సిందేనని పోలీసులకు తెగేసి చెప్పింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story