వ్యక్తి దారుణ హత్య.. శవంతో కామవాంఛ తీర్చుకున్న నిందితులు

దేశంలో కొందరు చేసిన దారుణాలను చూస్తుంటే సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా.? అన్న అనుమానం కలగకమానదు. ఇలాంటి వారిని ఏం చేసిన పాపంలేదని కోపంతో రగిలిపోతుంటాము. ఇలాంటి కామాంధులు వల్ల సమాజం తలదించుకునే పరిస్థితి వస్తోంది. కొందరు మృగాళ్లు చేస్తున్న దారుణాల వల్ల సమాజంపై మాయని మచ్చ ఏర్పడుతోంది. ఇద్దరు మృగాళ్లు కలిసి ఓ వ్యక్తిని చంపేసి, ఆ తర్వాత అతనిపై కామవాంఛ తీర్చుకున్న ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్, బీహార్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దక్షిణ ఢిల్లీలోని నెబ్‌ సరై ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి అదే ప్రాంతంలో ఉన్న మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. గత మంగళవారం రాత్రి బాధితుడి ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు అతనితో ఘర్షణకు దిగారు. మాటమాట పెరిగి ఆగ్రహానికి గురైన ఇద్దరు వ్యక్తులు.. పరిచయం ఏర్పడిన వ్యక్తి గొంతునులిపి హత్య చేశారు. అనంతరం శవంతో తమ కామవాంఛ తీర్చుకున్నారు.

అనంతరం ఆ రాత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మరుసటి రోజు బుధవారం అతని ఇంటికి వచ్చి శవాన్ని తరలించే క్రమంలో ఇద్దరూ మృతుడు సోదరి కంటపడ్డారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే సోదరుడి దారుణ హత్యపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టగా, నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. గొడవ కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. అంతేకాదు చంపేసిన తర్వాత తాగిన మైకంలో శవంతో కూడా కామవాంఛ తీర్చుకున్నారని తేలింది. ఇలాంటి వారికి ఉరిశిక్ష విధించాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *