మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలిసిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. తన ఎనిమిదేళ్ల కుమారుడిని హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టింది. నల్గొండ జిల్లాలోని బుద్దారం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో.. తన ఎనిమిదేళ్ల కుమారుడు నాగరాజును అతడి తల్లి విజయ హత్య చేసింది. ప్రియుడితో కలిసి కొడుకు నాగరాజు గొంతును టవల్‌తో బిగించి చంపేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజు హఠాత్తుగా చనిపోవడం గ్రామస్తుల అనుమానానికి కారణమైంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నల్గొండ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.