ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిందో కొత్త కోడలు. ఆమె ఆశలు అడియాశలు అయ్యాయి. కన్న తల్లిలా చూసుకోవాల్సిన అత్తగారే.. కొత్తకోడలికి కన్యత్వ పరీక్ష పెట్టింది. సహానంతో ఆ పరీక్షలో నెగ్గిన కోడలు ఇక అంతా మంచే జరుగుతుందని భావించింది. అయితే.. ఆ అత్త తన పెద్ద కొడుకుతో కోడలిపై అత్యాచారం చేయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఇండోర్‌కు చెందిన మహిళకు మహిళ(30)కు 2017, మే 4న ఓ వ్యక్తితో వివాహమైంది. కొత్త ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. ఓ రెండు రోజులు అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. భర్తతో హనీమూన్ వెళ్లేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో అత్తగారు కోడలిని బాత్రూమ్‌కు పిలిచింది. అత్తగారు పిలుచారు గదా వెళ్లిన కోడలికి అత్తగారి మాటలు విని షాక్‌ తగిలింది. అత్తగారు కోడలిని బట్టలు విప్పమని చెప్పింది. దీంతో షాకైన ఆమె ఎందుకుని నిలదీయగా.. ‘నువ్వు కన్యవో? కాదో? తెలుసుకోవాలి’ అని చెప్పడంతో షాకైంది.

విషయాన్ని భర్తకు చెప్పగా.. పెద్దవాళ్లు అన్నీ మన మంచికే చేస్తారు. మా అమ్మ మాటకు ఎదురుచెప్పకుండా నువ్వు కన్యవేనని నిరూపించుకో అని చెప్పాడు. దీంతో ఇష్టం లేకపోయినా.. అత్తగారి ముందు నగ్నంగా నిలబడి కన్యత్వ పరీక్షలో నెగ్గి భర్తతో హనీమూన్‌కు వెళ్లింది. అలా ఓ నాలుగు నెలల పాటు వారి కాపురం సజావుగా సాగింది.

ఆమెపై కన్నేసిన బావ(భర్తకు అన్న) తరుచూ అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. విషయాన్ని కోడలు అత్తగారికి చెప్పినప్పటికి పట్టించుకోలేదు. 2017, అక్టోబర్ 27వ తేదీన పెద్ద కొడుకు గదిని శుభ్రం చేయాలని చెప్పి కోడలిని అతని గదిలోకి పంపించింది. అప్పటికే ఆమె రాక కోసం వెయిట్‌ చేస్తున్న అతడు.. ఆమె రాగానే తలుపులు మూసివేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని అత్తగారి చెప్పి బాధపడుతుండగా.. అత్తగారి మాటలు మరింత బాధించాయి. నా ఇద్దరు కొడుకులను సుఖపెట్టే అదృష్టం నీకొచ్చినందుకు సంతోషించు. ఇలాంటి చిన్న విషయాలను పెద్దవి చేసి సంసారాన్ని నాశనం చేసుకోకు అని కోడలిని హెచ్చరించింది.

భయపడిన భాదితురాలు మరుసటి రోజే పుట్టింటికి వెళ్లిపోయింది. జరిగిన విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక తనతో తానే కుమిలిపోయింది. కూతురు అత్తారింటికి వెళ్ల మంటే.. వెళ్లకుండా నిరాకరిస్తుండడంతో.. అనుమానం వచ్చి ఆమెను ప్రశించగా అసలు నిజం చెప్పింది. తమ కూతురికి జరిగిన అన్యాయంపై రగిలిపోయిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. భర్త, బావ, అత్త పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.