'హిందూ' అనేది మతం కాదు.. మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2019 10:01 AM GMT
హిందూ అనేది మతం కాదు.. మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు

భువనేశ్వర్‌: దేశంలో హిందూ సంస్కృతి ఫలితంగానే ఇతర దేశాలతో పోలిస్తే ముస్లింలు భారత్‌లో అత్యంత సంతోషంగా ఉన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఒడిషాలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌ భగవత్‌ హిందూ అనేది ఓ మతం లేదా భాష కాదని, ఓ దేశం పేరూ కాదని చెప్పుకొచ్చారు. భారత్‌లో నివసించే వారందరి సంస్కృతి హిందూ అని వ్యాఖ్యానించారు. భిన్న సంస్కృతులను హిందూ విధానం ఆమోదించి గౌరవిస్తుందని చెప్పారు.

యూదులు సంచరిస్తున్నప్పుడు వారికి ఆశ్రయం కల్పించిన ఏకైక దేశంగా భారత్‌ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. పార్శీలు కేవలం భారత్‌లోనే స్వేచ్ఛగా తమ మతాన్ని అనుసరిస్తారని ఇదంతా హిందూ మతం గొప్పతనమేనని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ముద్ర అంతరించి సమాజమంతా ఒకే వర్గంగా మెలగాలన్నది తన ఆక్షాంక్షని స్పష్టం చేశారు. భిన్న సంస్కృతులు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటిగా మెలిగినప్పుడు ముస్లింలు, పార్శీలు ఇతరులు దేశంలో సురక్షితంగా ఉన్నామనే భావనతో ఉంటారని చెప్పారు. మెరుగైన సమాజం ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపు ఇచ్చారు.

ఇది కూడా చదవండి:

https://telugu.newsmeter.in/kalam-is-a-cosmopolitan/

ఇది కూడా చదవండి:

https://telugu.newsmeter.in/144-section-in-ayodhya/

Next Story