నగ్నంగా నిద్రపోతున్న మోడల్.. కళ్లు తెరిచి చూసేసరికి…

జార్జియా : ఆమె ఒక మోడల్. తన బెడ్రూమ్ లో నగ్నంగా నిద్రపోతోంది. ఇంతలో పెద్ద శబ్దమవ్వడంతో ఉలిక్కి పడి లేచింది.  ఆ తర్వాత షాక్ అవడం ఆమె వంతైంది. అమెరికాకు చెందిన డేనీ బాంక్స్ అనే మోడల్ అడల్ట్ వీడియోలు, క్లబ్బుల్లో పనిచేస్తుంటుంది. నగ్నంగా నిద్రపోవడం ఆమెకున్న అలవాటు. ఇంతలో ఎవరో తలుపులు బద్దలు కొట్టినట్లుగా పెద్ద చప్పుడవ్వడంతో ఆమె పెంపుడు కుక్క పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆ చప్పుళ్లకు కళ్లు తెరిచి చూసిన డేనీ బాంక్స్ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. ఓ దుండగుడు ఆమెకు గన్ ఎక్కుపెట్టి బీరువాలోని లాకర్ ఓపెన్ చేయమని బెదిరించాడు.

లాకర్ లో ఏమీ లేవని, అంతా ఖాళీయేనని చెప్పినా అతను నమ్మలేదు. చేసేది లేక డెనీ లాకర్ ఓపెన్ చేసి చూపించింది. అంతా ఖాళీగా ఉండటంతో దుండగుడు డెనీని మంచంమీదికి తోసి పరారయ్యాడు. లేచి చూసే సరికి అతను పారిపోవడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. జరిగిన ఘటనంతా ఇంటిలోని సీసీ కెమెరాల్లో రికార్డయి ఉందని చెప్పగా పోలీసులు దానిని పరిశీలించారు. అయితే అందులో డెనీ, దుండగుడి ముఖాలు కనిపించకపోవడంతో, ఇలాంటివి చేయడం ఆమెకు అలవాటేనని తెలిసి ఇదొక స్టంట్ గా భావించారు. కానీ ఆ సీసీ కెమెరా తన పెంపుడు కుక్క కోసం ఫిక్స్ చేసిందని, అందుకే అది ఎప్పుడూ కిందికే ఉంటుందని డెనీ వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.