వివాహేత‌ర సంబంధాల కోసం ఎంత‌కైనా తెగిస్తున్నారు. క్ష‌ణిక సుఖం కోసం ప్రియుడి మోజులో ప‌డి జీవిత భాగ‌స్వామిని క‌డ‌తేరుస్తున్నారు. ఓ మ‌హిళ భ‌ర్త స్నేహితుడితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. భ‌ర్త‌కు నిద్ర‌మాత్ర‌లు ఇచ్చి చాలా సార్లు చంపాల‌ని ప్ర‌య‌త్నించింది. అయితే.. ఆ భ‌ర్త ఎలాగోనా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఓ రోజు భ‌ర్త నిద్రిస్తుండ‌గా ప్రియుడితో కామ‌కేళీలో మునిగిపోయింది. భ‌ర్త‌కు మెళ‌కువ వ‌చ్చి చూసే స‌రికి భార్య ప్రియుడితో న‌గ్నంగా క‌నిపింది. త‌మ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డంతో.. ప్రియుడితో క‌లిసి భార్య భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లాలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రాజ బొల్లారం గ్రామ పంచాయ‌తీ అక్బార్జాపేటలో మ‌హంకాళి కృష్ణ(36), ల‌క్ష్మీ దంప‌తులు నివాసం ఉంటున్నారు. కృష్ణ వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు. 2014లో కృష్ణ త‌న ఆటోను అదే గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌కు అమ్మాడు. ఈ క్ర‌మంలో బాల్‌రాజ్‌.. కృష్ణ ఇంటికి త‌ర‌చుగా వ‌స్తుండేవాడు. ఈ క్ర‌మంలో ల‌క్ష్మీతో అత‌నికి వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. భ‌ర్త‌కు బ‌య‌ట‌కు వెళ్ల‌గానే.. ప్రియుడిని పిలిపించుకుని లైంగిక వాంఛ‌లు తీర్చుకునేది. కాగా.. కొద్ది రోజుల క్రితం విష‌యం భ‌ర్త‌కు తెలిసింది. దీంతో ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని భార్య‌ను తీవ్రంగా మంద‌లించాడు. అయినా ల‌క్ష్మీ ప్ర‌వ‌ర్త‌నలో మార్పు రాలేదు. ఈ విష‌య‌మై రోజు భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి.

త‌మ సంబంధానికి భ‌ర్త అడ్డు వ‌స్తున్నాడ‌ని అత‌ని చంపేయాల‌నుకుంది. ప‌లు మార్లు భ‌ర్త‌కు నిద్ర‌మాత్ర‌లు ఇచ్చి భ‌ర్త‌ను చంపేందుకు ప్ర‌య‌త్నించింది. కాగా.. కృష్ణ ఎలాగోలా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాడు. ఈ నెల 8న కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్నాడు. వెంట‌నే ల‌క్ష్మీ ప్రియుడికి ఫోన్ చేసింది. ప్రియుడు రాగానే ఇద్ద‌రు రాస‌లీల‌లో మునిగిపోయాడు. కృష్ణ‌కు మెల‌కువ వ‌చ్చింది. ప్రియుడితో ఉన్న భార్య‌ను చూసి జ‌ర‌గ‌బోయే ప్ర‌మాదాన్ని ఊహించి బ‌య‌ట‌కు ప‌రిగెత్తుకు వ‌స్తుండ‌గా.. ల‌క్ష్మీ ప్రియుడితో క‌లిసి ఇస్త్రీ పెట్టే తీగ‌ను భ‌ర్త గొంతుకు బిగించి హ‌త్య చేశారు.

స‌మాచారం అందుకు న్న పోలీసులు అక్క‌డకు చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. విచార‌ణ‌లో భార్య‌, ప్రియుడితో క‌లిసి హ‌త్య చేసింది అని తేల‌డంతో ల‌క్ష్మీ, బాల్‌రాజ్‌ల‌ను అరెస్టు చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.