ఓ వివాహిత.. రియల్‌ ఎస్టేల్‌ సంస్థలో పని చేస్తుంది. ఈ క్రమంలో ప్రతి రోజు తన నివాసం నుంచి ఆఫీసుకి బస్‌లో వెలుతుండేది. ఆమెపై కన్నేశాడు ఆ బస్సు కండక్టర్‌. ఆమెను లొంగదీసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆమె.. అతని కోరికను తిరస్కరించడంతో పగ పెంచుకున్నాడు. బస్టాండ్‌లో అందరు చూస్తుండగానే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలి టౌన్ షిప్ 21 లేన్ ప్రాంతంలో జాన్ విక్టర్, సలోమి (25) దంపతులు నివసిస్తున్నారు. కాగా సలోమి ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో పని చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి రోజు ఆమె ఇంటి నుంచి కడలూరులోకి ఆఫీసుకు ఓ ప్రైవేట్‌ బస్సులో వెళ్లేది. ఆ బస్సు కండక్టర్‌ సుందరమూర్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమె అందానికి షిదా అయిన సుందరమూర్తి.. రోజూ ఆమెతో మాటలు కలిపేవాడు. తన కోరికను పరోక్షంగా ఎన్నో సార్లు ఆమెకు చెప్పినా.. ఆమె పట్టించుకోలేదు. దాంతో మనోడు నేరుగా వేధించడం ప్రారంభించాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని బెదిరించేవాడు. తాను అలాంటి దానిని కాదని, తనకు భర్త, పిల్లలు ఉన్నారని చెప్పింది. అయినా వేదింపులు ఆగలేదు. అప్పటి వరకు వేదింపులను మౌనంగా భరించింది.

ఇటీవల ఆమె ఆ బస్సును ఎక్కడం మానివేసింది. దీంతో సుందరమూర్తి ఆమెపై పగ పెంచుకున్నాడు. తనకు ఇక లొంగదని భావించి.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం సలోమికి వెళ్లే దారిలో ఆమెను ఆటకాయించాడు. నడుచుకుంటూ వెళ్తున్న ఆమె దగ్గరకు వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలకు తాళలేక ఆమె.. పెద్దగా కేకలు వేసుకుంటూ పరుగులు పెట్టింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను కురింజిపాడి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సలోమి పరిస్థితి విషమంగా ఉంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.