కొడుకు లేని సమయం చూసి..

సమాజంలో రోజురోజుకు మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. వావివరుసలు మరిచిపోతున్న కామాంధులు సొంత వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతూ బంధాలకు మాయని మచ్చ తెస్తున్నారు. ఓ వ్యక్తి కోడలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.

పాత బొబ్బిలి ప్రసాద్‌నగర్‌ కాలనీలో ఓ యువకుడికి కొంతకాలం క్రితం వివాహమైంది. కొత్త దంపతులు వేరు కాపురం ఉంటున్నారు. యువకుడికి చిన్నాన్న వరుస అయ్యే వ్యక్తి తరుచూ వాళ్లింటికి వచ్చేవాడు. చిన్న మామగారే కదా అని ఆమె కూడా అతనితో చనువుగానే మాట్లాడేది. ఈ క్రమంలో ఆ కామాంధుడి కన్ను ఆమెపై పడింది. ఆదివారం భర్త పనికి వెళ్లడంతో.. వివాహిత ఒంటరిగా ఉంది. భర్త భయటికి వెళ్లడాన్ని గమనించిన అతడు.. ఇంట్లోకి ప్రవేశించి.. ఆమెను తాళ్లతో కట్టి వేశాడు. కేకలు వేయకుండా నోటీలో గుడ్డలు కుక్కాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడి అనంతరం పరారయ్యాడు.

వరుసకు చిన్న మామ అయ్యే వ్యక్తే అత్యాచారానికి పాల్పడడంతో బాధితురాలు షాక్‌లోకి వెళ్లింది. చాలా సేపటి తరువాత తేరుకున్నఆమె.. విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తనే మదన పడింది. చివరికి ఎదురింటి వారికి తన గోడును చెప్పుకుంది. బాధితురాలిని ఓదార్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకన్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా చిన్నమామ గతంలోనూ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, చంపేస్తానని బెదిరించడంతో ఆ విషయం ఎవరికీ చెప్పలేదని బాధితురాలు తెలిపింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్