వివాహేత‌ర సంబంధాలు పచ్చ‌ని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. ఈ సంబంధాలు బ‌య‌ట‌ప‌డ‌డంతో హ‌త్య‌లు చేయ‌డం గానీ, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం లాంటి ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల బాగా పెరిగిపోతున్నాయి. ఓ వివాహిత కార‌ణంగా భ‌ర్త‌తో పాటు ఆమె ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంది.

మైసూరు జిల్లా టి.నరసీపుర తాలూకా హొరళళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజుకి కీర్తి (పేరు మార్చాం) యువతితో వివాహమైంది. కొద్ది రోజుల వ‌ర‌కు వీరు అన్యోన్యంగా ఉన్నారు. మ‌హాదేవ అనే యువ‌కుడితో కీర్తి అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్ల‌గానే ఆమె ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని రాస‌లీల‌లు సాగించేది. కొద్ది కాలం వీరి గుట్టుగా సాగిన వీరి బాగోతం సిద్ద‌రాజుకి తెలిసింది. దీంతో ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని కీర్తికి ప‌లుమార్లు చెప్పాడు. అయినా ఆమె విన‌లేదు. త‌మ మ‌ధ్య ఉన్న సంబంధానికి భ‌ర్త అడ్డువ‌స్తున్నాడ‌ని అత‌డిని అడ్డుతొల‌గించుకోవాల‌ని ప్రియుడ్ని కోరింది.

ప్రియుడు మహాదేవతో కలిసి సిద్ధరాజును చంపేందుకు ప్లాన్ వేసింది. సిద్ద‌రాజుకు మాయ‌మాట‌లు చెప్పి భ‌య‌ట‌కు తీసుకెళ్లి ప్రియుడి సాయంతో భ‌ర్త‌ను చంపేసింది. అనంత‌రం భ‌ర్త శ‌వాన్ని ఓ చోట పూడ్చిపెట్టారు. వీరిద్ద‌రికి మ‌హ‌దేవ స్నేహితుడు సిద్ద‌ప్ప సాయం చేశాడు.

ఆ త‌రువాత కీర్తి మ‌రో కొత్త‌నాట‌కానికి తెర‌తీసింది. త‌న భ‌ర్త క‌నిపించ‌డం లేదంటూ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కీర్తి వ్య‌వ‌హార శైలిపై అనుమానం రావ‌డంతో ఆమె గురించి ఆరా తీయ‌గా అక్ర‌మ సంబంధం బ‌య‌ట‌ప‌డింది. దీంతో కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు త‌మ‌దైన శైలిలో విచారించ‌గా.. అసలు నిజం చెప్పింది. దీంతో ప్రియుడు మ‌హ‌దేవ అదుపులోకి తీసుకోవ‌డానికి పోలీసులు వెళ్ల‌గా.. ఈవిష‌యం తెలిసిన మ‌హాదేవ అప్ప‌టికే విష‌యం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కామ దాహంతో ఇద్దరి మరణానికి కారణమైన సునీతను కఠినంగా శిక్షించాలని రెండు కుటుంబాల వారు డిమాండ్ చేస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.