రోజు రోజుకు మాన‌వ‌సంబంధాలు దిగ‌జారిపోతున్నాయి. తాత్కాలిక శారీర‌క సుఖం కోసం కొంద‌రు ప‌శువుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వావీ వ‌రసులు మ‌రిచి అన్న‌తోనే అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. అన్నా చెల్లెళ్ళ బంధానికి మాయ‌ని మ‌చ్చ తెచ్చింది. త‌మ సుఖానికి భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని అత‌న్ని చంపేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వెలుగుచూసింది.

ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా పరిధిలోని ఖండా గ్రామానికి చెందిన ఠాకూర్ నోయిడా లోని ఒక ప్రయివేటు కంపెనీలో డిజైనర్ గా పని చేస్తున్నాడు. భార్య రవీన, ఏడాదిన్నర కొడుకుతో అక్కడే నివాసం ఉంటున్నాడు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించ‌డంతో మార్చి 24న భార్య పిల్లాడితో క‌లిసి స్వ‌గ్రామానికి వ‌చ్చాడు. గ్రామంలో అతని ఇంటికి పక్కనే ఉండే రవీనా అన్న ప్రతాప్ నివాసం ఉంటున్నాడు.

వీరిద్ద‌రికి ఎప్ప‌టినుంచో వివాహేత‌ర సంబంధం కొన‌సాగుతుంది. గ్రామానికి రావ‌డంతో వీరికి హ‌ద్దే లేకుండా పోయింది. అన్న ప్ర‌తాప్ ఇంటికి వెలుతున్నాన‌ని చెప్పి భ‌ర్త‌కు తెలియ‌కుండా.. అత‌నితో రాస‌లీల‌లు సాగించింది. ఇటీవ‌ల వీరి వ్య‌వ‌హారం విక్ర‌మ్ కంట ప‌డింది. దీంతో భార్య ర‌వీనాను తీవ్రంగా మంద‌లించాడు. అయితే త‌మ మ‌ధ్య ఉన్న బంధానికి భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని, అడ్డుతొల‌గించుకోవాల‌ని ప్లాన్ వేసింది.

ఏప్రిల్ 2న తెల్ల‌వారు జామున 2.30గంట‌ల స‌మ‌యంలో నిద్ర‌స్తున్న భ‌ర్త విక్ర‌మ్ గొంతును క‌త్తితో కోసి హ‌త్య చేశారు. రక్తపు మడుగులో మంచంపై పడి ఉన్న విక్రమ్‌ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అన్న వరసయ్యే ప్రియుడితో కలసి భార్యే ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి రవీనాని అరెస్టు చేశారు. ఆమె అన్న ప్రతాప్ పరారీలో ఉన్నాడు. నిందితురాలు రవీనా పోలీసు విచారణకు సహకరించడం లేదని.. పరారీలో ఉన్న ప్రతాప్ కోసం గాలిస్తున్నామని.. అతను పట్టుబడిన వెంటనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసు అధికారి తెలిపారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.