కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి.. వావి వరసలు మరిచాడు. కన్న కూతురు అని చూడకుండా కాటేశాడు. సొంత కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండి జిల్లా బాలిచౌకి తెహ్సిల్‌ ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులు, కూతురితో కలిసి నివాసం ఉంటున్నారు. సరదాగా, ప్రశాంతంగా వీరి సంసార జీవితం సాగింది. ఇటీవల భార్య నెల రోజుల పని మీద బంధువుల ఊరెళ్లింది. ఇదే సమయంలో కన్న కూతురిపై కామ పిశాచి తండ్రి కన్నేశాడు. ఇంట్లో భార్య లేకపోవడంతో మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి కామదాహం తీర్చుకున్నాడు. కన్న బిడ్డ అని చూడకుండా బలవంతంగా అత్యచారం చేశాడు. ఆ మానవ మృగం అంతటితో ఆగలేదు.. భార్య ఇంట్లో లేని నెల రోజుల పాటు మైనర్‌ బాలికకు నరకం చూపించాడు. నెల రోజుల తరబడి దారుణానికి ఒడిగట్టాడు.

భార్య ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకుంది. కట్టుకున్న భర్తే.. కామపిశాచిగా మారి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న విషయం తెలుసుకొన్న ఆమెకు గుండై బద్దలైనంత పనైంది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని.. కూతురు తల్లికి చెప్పింది. జరిగిన దారుణం తల్లడిల్లిపోయిన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మానవ మృగాన్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, బెదిరింపుల సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. వావీవరసలు మరిచి దారుణాలకు ఒడిగడతున్నారు. కోర్టులు ఉరిశిక్షలు విధిస్తాయని తెలిసినా.. రెచ్చిపోతున్నారు. కామాంధుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.