మెట్రో రైల్లో యువతి ఎదురుగా నిలబడి.. ఆ యువకుడు ఏం చేశాడంటే..

దేశంలో మహిళల భద్రతకు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. వారి పట్ల వేధింపులు ఆగడం లేదు. తాజాగా దిల్లీ మెట్రోలో ఓ యువకుడు చేసిన పని సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. దిల్లీ మెట్రోలో ఓ యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఆఫీస్‌ పనులు ముగించుకుని సాయంత్రం ఆరుగంటలకు దిల్లీ నుంచి గురుగ్రామ్‌ వెళ్లేందుకు మెట్రో రైలు ఎక్కింది ఓ యువతి. కాసేపటి తరువాత ఓ యువకుడు వచ్చి ఆ ఎదురుగా నిలుచుకున్నాడు.

ట్రైన్‌లోనే ప్యాంట్‌ జిప్‌ తీసి తన మర్మాంగాన్ని.. యువతికి చూపిస్తూ అసహ్యంగా ప్రవర్తించసాగాడు. ఊహించని ఈ ఘటనతో యువతి భయపడిపోయింది. తన ప్రైవేట్‌ పార్ట్‌ని బయటే ఉంచి వేరేవారికి కనిపించకుండా బ్యాగ్‌ను అడ్డుపెట్టుకున్నాడు. తరచూ బ్యాగ్‌ను పక్కకు తీస్తూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ భయానక అనుభవాన్ని ఎవర్వికి చెప్పుకోలేక యువతి ఇంటికి వెళ్లింది.

అనంతరం తాను ఎదుర్కొన్న దారుణ అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ట్వీట్‌కు డీఎంఆర్‌సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) స్పందించింది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే.. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించింది. ఫ్రెండ్స్ సాయంతో అతని ఫొటో సంపాదించినట్లు చెప్పిన యువతి.. అతను ఎక్కడ దిగిపోయాడో తెలియదని చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డాడు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్