ఓ యువతి స్నానం చేస్తుండగా.. యువకుడు వీడియో తీశాడు. ఆతరువాత ఆ వీడియోను ఆయువతికి చూపించి.. బెదిరించి అనేక సార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పెద్దల సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆ గర్భానికి తనకు ఏం సంబంధం లేదని.. ఆయువతిని ఇంటి నుంచి గెంటివేశాడు. మళ్లీ మోసపోయానని గ్రహించిన యువతి మరలా పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో చోటు చేసుకుంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) గతేడాది.. బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన లంక చినబాబు.. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అనంతరం.. ఆ వీడియోను యువతి చూపించి.. తాను చెప్పినట్లు వినకపోతే.. వీడియోను ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించి అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా యువతి గర్భం దాల్చింది. విషయం యువతి తల్లిదండ్రులకు చెప్పగా.. వారు యువకుడి పెద్దలతో మాట్లాడారు. వాళ్లు స్పందించకపోవడంతో.. గతేడాది డిసెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు వాపసు తీసుకుంటే.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అనంతరం పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు చినబాబు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్నట్లు నటించి తరువాత.. ఆ గర్భానికి తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ యువతిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. మళ్లీ మోసపోయానని భావించి మరోమారు పోలీసులను ఆశ్రయించింది యువతి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.