ప్రాణం తీసిన శృంగారం

మలేషియా : శృతి మించిన శృంగారం ఒక వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమలో మునిగి తేలుతున్న ఓ జంట..శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలని భావించి..డ్రగ్స్ తీసుకున్నారు. ఏకంగా మూడ్రోజులు శృంగారంలో మునిగి తేలారు. నాల్గవరోజు ఉదయం లేచి చూసిన ప్రియురాలికి ఊహించలేని షాక్ తగిలింది. తన బాయ్ ఫ్రెండ్ మంచంపై రక్తపు మడుగులో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మలేషియాకు చెందిన జాన్, మేరీ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ..సహజీవనం చేస్తున్నారు. ఈ ప్రేమ పక్షులు ఓ రేంజ్ ఎంజాయ్ చేయాలని భావించి బ్యాంకాక్ కు బయల్దేరారు. అక్కడ ఒక హోటల్ లో రూమ్ తీసుకున్నారు. బయట చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసి..ఇష్టమొచ్చినట్లు ఎంజాయ్ చేశారు.

శృంగారాన్ని తనివి తీరా ఎంజాయ్ చేయాలని భావించిన వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నారు. అలా డ్రగ్స్ మత్తులోనే ఏకంగా మూడ్రోజులు శృంగారంలో పాల్గొన్నారు. మరుసటి రోజు..ఏమైందో ఏమో గాని జాన్ రక్తపు మడుగులో శవమై ఉన్నాడు. అతడిని చూసిన మేరీ..ప్రియుడిని తానే చంపానని అందరూ అనుకుంటారని భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఎన్నిరోజులైనా గది తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది గది తలుపులు తీసి చూసి..నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా..పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కు తరలించారు.

అతనితో పాటు వచ్చిన ప్రియురాలు మేరీని వెతికి పట్టుకున్నారు. జాన్ మృతిపై మేరీని ప్రశ్నించగా..ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. విపరీతంగా శృంగారం చేయాలని భావించిన తాము..ఓ వీడియో చూసి అలానే చేసినట్లు తెలిపింది. ప్రియుడు జాన్ ను మంచానికి కట్టేసి, కత్తితో శరీరంపై గాట్లు పెట్టానని పేర్కొంది. అప్పటికి బాగానే ఉన్నప్పటికీ..తర్వాత అది అంత సీరియర్ అవుతుందని తాను భావించలేదని వాపోయింది మేరీ. కాగా..మూడ్రోజులపాటు యథేచ్ఛగా శృంగారం చేయడంతో సున్నితమైన నరం తెగి జాన్ తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.