క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో విజృభిస్తోంది. రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మ‌రో సారి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ను మ‌రో రెండు వారాల పాటు పొడిగిస్తున్న‌ట్లు కేంద్ర హోం శాఖ ప్ర‌క‌టించింది. మే 17 వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ కొన‌సాగ‌నుందని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి, మదింపు ఉంటుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మ‌రో సారి జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. కాగా.. నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో కీలక స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో హోంమంత్రి అమిత్‌ షా , రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి షీయూష్ గోయ‌ల్, కేబినేట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబా పాల్గొన్నారు. లాక్‌డౌన్ పొడిగింపు నేప‌ధ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి వారి అభిప్రాయాల‌ను తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *