కోటంరెడ్డి కేసును ప్రభుత్వం ఎందుకు నీరుగారుస్తోంది?: పవన్ కల్యాణ్

By Newsmeter.Network  Published on  9 Oct 2019 1:08 PM GMT
కోటంరెడ్డి కేసును ప్రభుత్వం ఎందుకు నీరుగారుస్తోంది?: పవన్ కల్యాణ్

అమరావతి : వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి చేసిన కేసును ప్రభుత్వం ఎందుకు నీరుగారుస్తోందని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఎంపీడీవో పెట్టిన క్రిమినల్‌ కేసులను నీరుగార్చడం ద్వారా వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశమిస్తోందని ఆయన నిలదీశారు. "మా శాసనసభ్యులు దాడులు చేస్తారు.. ప్రజలు భరించాలని చెబుతున్నారా..? "అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నిరసన గళం విప్పితే నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు, 307 కింద హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారన్నారు. మహిళా ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై బెయిల్ సులువుగా వచ్చే సెక్షన్లను నమోదు చేశారని పవన్ అన్నారు . నాడు ముసునూరు ఎంపీడీవో వనజాక్షిపై అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి, ఇప్పుడు సరళ ఇంటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి ఒకేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు పవన్ కల్యాణ్.

మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం - ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాని

అయితే..తమ మధ్య విభేదాలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాని. కాకాని స్వయానా తమ మేనత్త కుమారుడు అని కోటం రెడ్డి అంటే..కోటంరెడ్డి తన స్వంత బామర్ది అని కాకాని అన్నారు. తమ మధ్య విభేదాలు వుంటే పరిష్కరించుకుంటామన్నారు. చిన్నప్పటి నుంచి తామిద్దరం స్నేహితులమన్నారు కాకాని.

Next Story
Share it