భార్యపై అనుమానంతో.. అక్కడ

నమ్మకం, గౌరవం, కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడడం, మానసికంగా ఆలంబన కలగజేయడం, మనసా, వాచా కర్మేణా తన భాగస్వామితోనే జీవన సౌఖ్యాలను పొందడం, సత్సంతానంగా పుట్టిన బిడ్డలను పెంచి పెద్ద చేయడం, ఇద్దరి తల్లిదండ్రులను గౌరవించి ఆదరించడం, వృద్ధాప్యంలో తోడూనీడగా జీవన సంధ్యని గడుపుకోవడం! ఇదే వివాహ బంధం.. ఇలా ఉంటేనే అది అన్యోన్య దాంపత్యం. భార్యభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం. భార్య పై అనుమానం పెంచుకున్న భర్త. తాను బయటికి వెళ్లే సమయంలో భార్య జననాంగాలకు తాళం వేసి పైశాచికంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పోలీసులకు చేరడంతో.. భర్త కటకటాలు లెక్కించాల్సి ఉంది.

వివరాల్లోకి వెళితే.. కెన్యాకు చెందిన డెన్నిస్ ముమో అనే వ్యక్తి.. తన భార్య నలుగురితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తుందని అనుమాన పడేశాడు. అతనికో వికృత ఆలోచన వచ్చింది. తాను ఇంట్లో లేని సమయంలో ఆమె జననాంగాల వద్ద సీల్ వేసేందుకు వాడే జిగురు లాంటి పదార్థాన్ని రాసి తాళం వేసి వెళ్లేవాడు. తాను ఎలాంటి తప్పు చేయడం లేదని ఆమె మొత్తుకున్న డెన్నిస్ పైశాచికంగా వ్యవహరించేవాడు. అయినా ఆమె భర్త చేసే ఆరాచకారాలను భరించేది.

అయితే ఇటీవల అతను బయటికి వెళ్లేటప్పుడు భార్య జననాంగం వద్ద ఆ పదార్థాన్ని రాశాడు. కాసేపటికే ఆమెకు అక్కడ మంటగా అనిపించడంతో వెంటనే హాస్పిటల్‌కి వెళ్లింది. ఆమె పరిస్థితి చూసి అక్కడి వైద్యులు షాకయ్యారు. ట్రీట్‌మెంట్‌ ఇచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆమె నుంచి వివరాలు సేకరించి.. భర్తను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారలో పలు విషయాలను వెల్లడించాడు. తన భార్య నలుగురితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. తాను లేని సమయంలో ఆమె.. తన నగ్న చిత్రాలు వారికి పంపిస్తూ సెక్స్‌ చాట్ చేసేదని చెప్పాడు. ఇటీవల ఆమె మొబైల్ పోన్‌ చూసినప్పుడు ఈ విషయాలు తెలిసాయని చెప్పాడు. అందుకే ఆమె పట్ల అలా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. అయితే అతడు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకలేకపోవడంతో పోలీసులు భర్తను కోర్టులో హాజరుపరిచారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్