టీఆర్ఎస్ నేత‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు త‌న‌యుడి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఎమ్మెల్యే కుమారుడు సందీప్ రావ్ డైరెక్టరుగా కొనసాగుతున్న ప్రణీత్ గ్రూప్ కంపెనీలో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. ప్రణీత్ గ్రూప్ సంస్థ కార్యాలయాలతో పాటు ఎండీ నరేందర్, మరో ఐదు మంది డైరెక్టర్ల ఇళ్ళల్లో ఏక‌కాలంలో సోదాలు జ‌రుగుతున్నాయి. ఈ విష‌య‌మై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.