దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 2:05 PM GMT
దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి..!

ముఖ్యాంశాలు

  • దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి
  • దీక్ష విరమింపజేసిన మంద కృష్ణ మాదిగ
  • రేపు సడక్ సమ్మె వాయిదా, సమ్మె యథాతథం

ఆర్టీసీ సమ్మె 45వ రోజు కూడా ముగుస్తుంది. అయినా..స్ట్రైక్ ఓ కొలిక్కి రాలేదు. నిన్న అశ్వత్దామ రెడ్డి, రాజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు వారిచేత మంద కృష్ణ మాదిగ దీక్ష విరమింపజేశారు. నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ కార్మిక నేతలు ఓ మెట్టు దిగినా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు...ఈ రోజు కోర్టులో వాదిస్తూ..ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ సమ్మెగా ప్రకటించాలని కోరింది. ఆర్టీసీ యూనియన్‌ నేతల కార్మికుల కోసం కాకుండా...తమ స్వార్ధం కోసం దీక్ష చేస్తున్నారని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆర్టీసీని ఆర్ధికంగా కూడా ఆదుకోలేమని కుండబద్దలు కొట్టింది.

ఆర్టీసీ సమ్మెపై తెగదాకా లాగాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కార్మిక నేతలు ఓ మెట్టు దిగినా కూడా క్షమించే స్థితిలో, ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించడంలేదు. అంతేకాదు..సమ్మెను లేబర్ కోర్ట్‌కు హైకోర్ట్ బదిలీ చేసింది. రెండు వారాల్లో సమస్యను పరిష్కరించాలని లేబర్‌ కోర్ట్ ను హైకోర్ట్ ఆదేశించింది.

ప్రతిపక్షాల చట్రంలో కార్మిక నేతలు ఇరుక్కుపోయారని ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని..ఇలా సమ్మెలు చేసుకుంటూ పోతే ఆర్టీసీని కాపాడలేమని ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది. ఆర్టీసీని 50శాతం ప్రైవేటైజేషన్ చేయాలని కృతనివ్ఛయంతో ఉన్నట్లు ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మోదీ తెచ్చిన చట్టాని కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ముందు పెడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో, కొల్‌కతా ఆర్టీసీని ప్రభుత్వం వదిలేసిన విషయాన్ని కేసీఆర్‌ పదేపదే మీడియా ముందు చెబుతున్నారు . దీంతో...కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం మాట్లాడలేని స్థితి.

ఇటు ఆర్టీసీ - అటు కార్మికుల మధ్య సామాన్య జనం నలిగిపోతున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు. సరైన సమయంలో గమ్యం చేరుకోలేకపోతున్నారు. ప్రభుత్వం - కార్మికుల పంతాలు సామాన్యుడి చావుకి వచ్చాయనే చెప్పాలి. చూస్తుంటే..సమస్య మరో 15 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సమస్య కోర్టు ఎక్కితే పరిస్థితి ఇది. అదే ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సమస్య మరింత త్వరగా పరిష్కారమయ్యే అవకాశముంది. ప్రభుత్వం - కార్మికులు ఇద్దరూ పని చేసేది ప్రజల కోసమే కాబట్టి మరింత లోతుగా ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరముంది. ప్రజలు ఇటు ప్రభుత్వాన్ని- అటు కార్మికులను తిట్టి పోస్తున్నారు. ఇక..సడక్ బంద్ కూడా వాయిదా పడటం మంచిదే.

Next Story