మరిదితో రాసలీలల కోసం భర్తను చంపేసిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే..

దేశంలో అక్రమ సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. శృంగారం మోజులో పడి జనాలు ఎంతకైనా తెగిస్తున్నారు. వావి వరుసలు అనేవి పూర్తిగా మార్చిపోయి మృగాలుగా తయారవుతున్నాయి. వివాహ బంధాన్ని, రక్త సంబంధాలను సైతం లెక్కచేయకుండా శృంగారం ఊబిలో కూరుకుపోతున్నారు. కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు బతుకుదెరువు కోసం భార్య బిడ్డలను వదిలేసి విదేశాలకు వెళ్లిన భర్త.. భార్య అక్రమ సంబంధం కారణంగా బలైపోయాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిదితో వివాహేత సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్త విదేశాల నుంచి రావడంతో ఒక్కసారిగా ఆందోళన చెందింది. తన శృంగార జీవితానికి ఎక్కడ అడ్డొస్తాడోనని ప్రియుడి సాయంతో భర్తనే చంపేసింది భార్య. అంతేకాదు ప్రియుడి సాయంతో శవాన్ని పూడ్చివేసింది. తీరా ఏమి ఎరగనట్లు మకాం మార్చేసి మరిదితో కొత్త సంసారం మొదలు పెట్టింది. ఆరేళ్ల తర్వాత పోలీసులకు కంటపడటంతో వారి అక్రమ సంసారం బయటపడింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో ఆరేళ్ల తర్వాత పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు.

జరిగిందిలా..

తమిళనాడులోని కడలూరు హార్బర్‌సిగారతోపు గ్రామానికి చెందిన మురుగదాసన్‌కు భార్య సునీత, ఇద్దరు పిల్లులున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మురగదాసన్‌ కొన్నాళ్ల క్రితం సౌదీ వెళ్లి ఉద్యోగంలో చేరాడు. 2013 జనవరి 6న బావమరిది పెళ్లి ఉండటంతో స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి సౌదీ ఆరేబియాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అతడు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు కింద నమోదు చేసుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో మురుగదాసన్‌ సౌదీకి వెళ్లలేదని తేలింది. ఏదో జరిగిందని భావించిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు

పోలీసులకు అనుమానం వచ్చిందిలా..

ఇక కొన్ని రోజుల తర్వాత మురుగదాసన్‌ భార్య, అతని తమ్ముడు కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో మురుగదాసన్‌ తల్లి పవనమ్మాళల్‌ వారిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో షాకింగ్‌ నిజాలు బయటకు వచ్చాయి. మురుగదాసన్‌ సౌదీలో ఉన్న సమయంలో అతని తమ్ముడు ఆమె వద్దకు వచ్చేవాడని, ఆమె బాగుగోలు సైతం అతనే చూసుకుంటూ కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చేవాడని పోలీసులు దర్యాప్తుతో తేలింది. అలా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇద్దరికి వార్నింగ్‌ ఇచ్చిన మురుగదాసన్‌

కొన్ని రోజుల తర్వాత బావమరిది పెళ్లి ఉందని మురుగదాసన్‌ సౌదీ నుంచి ఇంటికి వచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న మురుగదాసన్‌ ఇద్దరినీ హెచ్చరించాడు. ఇక బావమరిది పెళ్లి ఉండటంతో భర్త స్వదేశానికి రావడంతో వీరి రాసలీలలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఎలాగైన భర్తను వదిలించుకోవాలని ఉద్దేశంతో భర్త ఇంట్లో నిద్రిస్తుండగా, భార్య, మరిది ఇద్దరు కలిసి గొంతునులిమి చంపేసి ఇంట్లోనే పూడ్చివేశారు. పైగా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. తర్వాత వారు ఇంట్లో నుంచి పారిపోయి కేరళకు చెక్కేశారు. ఇక పోలీసులకు అనుమానం రావడంతో వారిని పట్టుకుని తమదైన శైలిలోవిచారించగా, అసలు విషయాన్ని అంగీకరించారు. మురుగదాసన్‌ ను చంపేసి ఇంట్లోనే పాతిపెట్టినట్లు పోలీసులు ముందు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇలా అక్రమ సంబంధం వల్ల ఒకరి నిండు ప్రాణం బలైంది.  భార్య, మరిది కటకటాల పాలయ్యారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *