అత్త‌మామ‌ల‌కు ఆ అల్లుడు అంటే ఎంతో న‌మ్మ‌కం. కుమారులు లేని వారు అల్లుడిని సొంత కొడుకులా భావించారు. అత‌ను కూడా అంద‌రి ద‌గ్గ‌ర మంచివాడిలా న‌టించాడు. కాగా.. భార్య చెల్లిపై క‌న్నేశాడు. మాయ‌మాట‌ల‌తో మ‌ర‌ద‌లిని ముగ్గులోకి దింపాడు. భార్య‌కు తెలియ‌కుండా రాస‌లీల‌లు సాగించేవాడు. భార్య‌ అడ్డు తొల‌గించుకోవ‌డానికి మాస్ట‌ర్ ఫ్లాన్ వేశాడు. అయితే.. సీసీ కెమెరా అత‌డి ప్లాన్‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఈ ఘ‌టన‌ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో వెలుగు చేసింది.

ఘజియాబాద్‌కు చెందిన గౌత‌మ్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి గౌతమి అనే యువతితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గౌతమి మూడోసారి గర్భం దాల్చింది. కాగా.. వీరు గ‌త నెల 12న ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. షాపింగ్ పూర్తైన త‌రువాత ఇద్ద‌రు క‌లిసి వ‌స్తుండ‌గా.. కొంద‌రు దుండ‌గులు వారిని చుట్టుముట్టారు. గౌత‌మ్‌ను కొట్టి గౌత‌మిని పొడిచి బంగారం, డ‌బ్బులు దోచుకుని ప‌రార‌య్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు.

పార్కింగ్ ప్లేస్‌లో ఉండగా దుండ‌గులు తమపై దాడి చేసి భార్యను చంపేశారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ చూసి షాకయ్యారు. దీంతో గౌత‌మ్ అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేశారు. దీంతో అస‌లు నిజం క‌క్కేశాడు.

గౌతమికి పెళ్లయిన తర్వాత ఆమె చెల్లి ఉన్నత చదువుల కోసం అక్క ఇంటికి వచ్చింది. మ‌రద‌లి అందం చూసి గౌత‌మ్ ఆమెపై క‌న్నేశాడు. మ‌ర‌దలితో చ‌నువుగా ఉండేవాడు. భార్య‌కు తెలియ‌కుండా ఆమెకు ఖ‌రీదైన గిప్టులు కొనిచ్చేవాడు. ఓ రోజు త‌న కోరిక‌ను మ‌ర‌దలితో చెప్ప‌గా అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. భార్య‌కు తెలియ‌కుండా రోజు ఇద్ద‌రు త‌మ కామ‌వాంఛ‌ల‌ను తీర్చుకునేవారు. త‌మ సంబంధానికి భార్య అడ్డుగా ఉంద‌ని.. ఆమెను అడ్డు తొలిగిస్తే ఇద్ద‌రం హాయిగా ఉండొచ్చని అనుకున్నాడు.

ముగ్గురు సుపారీ కిల్లర్స్‌లో ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం మార్చి 12న వారు గౌతమిని కిరాతకంగా చంపేశారు. పోలీసులు చూసిన సీసీటీవీ పుటేజీలో గౌత‌మ్‌ వారికి సహకరించినట్లు స్పష్టంగా కనిపించింది. అతడిచ్చిన సమాచారంతో పోలీసులు ముగ్గురు క్రిమినల్స్‌ను అరెస్ట్ చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.