హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణ

By సుభాష్  Published on  26 Feb 2020 12:57 PM GMT
హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణ

హైదరాబాద్ మెట్రో వల్ల ఎంతో మందికి ఉపయోగంగా ఉంది. మెట్రో రైలు మొదటి దశ పూర్తి కావడంతో తెలంగాణ సర్కార్‌ రెండో దశపై దృష్టి సారించింది. కొత్త మార్గాల్లో రెండో దశను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌ 62 కిలోమీటర్ల మార్గానికి సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు సమర్పించిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

బేగంపేటలోని మెట్రోరైల్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండోదశలో బీహెచ్‌ఈఎల్‌, హఫీజ్‌పేట, కొండాపూర్‌, గచ్చిబౌలి, రేతిబౌలి, మెహిదీపట్నం, మసాబ్‌ ట్యాంక్‌, లక్డీకాపూర్‌ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, ఓవైసీ హాస్పిటల్‌, సైదబాద్‌, ఫలక్‌నుమా మీదుగా మరో మార్గాన్ని కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ఐదు కిలోమీటర్ల మార్గాన్ని కలపనున్నట్లు చెప్పారు.

ఎలివేటెడ్‌ మెట్రో రైలు నిర్మించడానికి రూ. 300 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు వ్యయాన్ని తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పాత బస్తీలో పెండింగ్‌లో ఉన్న మెట్రో ప్రాజెక్టు పనుల అంశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిలో ఉందని, భూసేకరణ పూర్తయిన వెంటనే అక్కడ పనులు చేపడతామని మెట్రో ఎండీ తెలిపారు.

Next Story