రోజురోజుకు మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. చిన్నారులను అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తల్లి.. ప్రియుళ్ల మోజులో పడి చిన్నారులను చిత్ర హింసకు గురి చేస్తోంది. మనకు ఏమైన బాధ వస్తే తల్లితో చెప్పుకుంటాం. మరీ అలాంటిది కన్నతల్లే బాధపడెతుంటే ఎవరికి చెప్పుకోవాలని దుస్థితి ఆ బాలలది. చివరకు స్పందన కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో తల్లి చేసే నిర్వాకం బయటపడింది.

ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. 2014లో నాయనమ్మ చనిపోగా.. 2015లో తండ్రి కూడా అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి, నాయనమ్మ బతికున్నంత వరకు తల్లి ఇద్దరు కొడుకులను బాగానే చూసుకున్నతర్వాతే వారిద్దరికి నరకం మొదలైంది. తల్లి.. షేక్‌ రహీం అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇదిచాలదు అనట్టు రహీం ప్రెండ్‌ ప్రమోద్‌ తోనూ అఫైర్‌ పెట్టుకుంది. ఇద్దరితో పిల్లల ముందే ఇంట్లోనే రాసలీలలు సాగించేంది. ఆమె ఇద్దరు ప్రియుళ్లు.. మద్యం మత్తులో పిల్లలను చిత్రహింసలకు గురిచేసేవారు.

చిన్నారులు బయటకు వెళితే.. తన బండారం ఎక్కడ బయట పడుతుందోనని.. చిన్నారుల స్కూల్ ను మానిపించింది. కనీసం ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లనిచ్చేది కాదు. ఇదిలా ఉండగా ఈ నెల 24న ప్రమోద్‌ తో ఆమెకు గొడవైంది. ఆగ్రహాం చెందిన ఆమె.. మీ వల్లే తన ప్రియుడితో తనకు గొడవైందని వారిని చితకబాదింది. భయపడిన చిన్నారులు ఎలాగోలా ఇంటినుంచి బయటకు వచ్చి తెలిసిన వారి నుంచి రూ.100తీసుకుని అమ్మమ్మ వద్దకు వెళ్లారు. ఆమె సాయంతో సోమవారం గుంటూరు పోలీస్‌ కార్యాలయానికి వచ్చి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.