భర్త వదిలేసిన ఓ మహిళను వివాహాం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఓ కూతురు ఉంది. కొద్దికాలం బాగానే ఉన్నా.. తరువాత ఆ కామాంధుడి కళ్లు కూతురిపై పడ్డాయి. తల్లిలేని సమయంలో.. రెండేళ్లుగా కూతురిపై పడి తన పశువాంఛ తీర్చుకుంటున్నాడు. కాగా ఇటీవల బాలిక ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో.. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది తల్లి. బాలికను పరీక్షించిన వైద్యులు నాలుగు నెలల గర్భిణీ అని చెప్పారు. దీంతో ఆ తల్లి గుండె బద్దలైంది. దాని నుంచి తేరుకునే లోపే మరో బండరాయి పడింది. ఆ గర్భాణినిక కారణం తన భర్తే అని తెలియడంతో ఆ తల్లి నిర్థాంతపోయింది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో వెలుగుచూసింది.

నేపాల్‌‌కి చెందిన ఓ వ్యక్తి సుమారు 13 ఏళ్ల కిందట రాజ్‌కోట్ జిల్లాలోని నవగమ్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకి పెళ్లై మూడేళ్ల కూతురు ఉంది. ఆమె భర్త వదిలి వెళ్లిపోవడంతో కూతురితో కలసి జీవిస్తున్న మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అతని కన్ను ఆమె కూతురిపై పడింది. తల్లి లేని సమయంలో సవతి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. చంపేస్తానని బెదిరించి రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతుండడంతో మైనర్ బాలిక గర్భం దాల్చింది. కొద్దికాలంగా బాలిక నీరసంగా ఉండడం గమనించిన తల్లి ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులకు అనుమానం వచ్చి పరీక్షలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక ఇప్పుడు నాలుగు నెలల గర్భంతో ఉందని చెప్పడంతో తల్లి షాక్‌కు గురైంది. కూతురిని విచారించడంతో తండ్రి అరాచకం బయటపడింది. రెండేళ్లుగా తనను శారీరకంగా హింసిస్తున్నాడని చెప్పడంతో ఆ తల్లి షాక్‌కు గురైంది. భర్తపై ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.