మహిళ నోట్లో కొందరు దుర్మార్గులు బియ్యం కుక్కి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకూ అపస్మారక స్థితిలో ఉన్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు(30) ఒంగోలు జిల్లా పేర్నమిట్ట శ్రీనగర్ కాలనీలోని ఎక్స్ టెన్షన్ లో నివాసముంటున్నట్లు పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం పేర్నమిట్టకు చెందిన ఆమెకు ఒంగోలుకు చెందిన వ్యక్తితో వివాహమయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…నగర శివారులోని కేశరాజుకుంట సమీపంలో మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా..అక్కడ ఒక మహిళ వివస్ర్తగా ఉండటం, ఆ పక్కనే నిరోధ్ ప్యాకెట్లు లభ్యమవ్వడంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అలాగే సంఘటనా స్థలంలో సంతనూతలపాడు నుంచి ఒంగోలు వచ్చిన బస్సు టికెట్, తులసీ రాం థియేటర్ కు చెందిన సినిమా టికెట్ కూడా లభించాయి.

పోలీసులకు లభించిన ఆధారాలను బట్టి మంగళవారం రాత్రి దుండగులు ఆమెను నగరం నుంచి కేశరాజుకుంట వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిఉంటారని భావిస్తున్నామన్నారు పోలీసులు. బాధితురాలికి చికిత్స చేసిన వైద్యులు ఆమె ఊపిరితిత్తుల్లో బియ్యపు గింజలున్నట్లుగా గుర్తించారని తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన సమయంలో ఆమె అరవకుండా దుండగులు ఆమె నోట్లో బియ్యం పోసి నోరు మూసేసి ఉంటారని..ఈ కారణంగానే ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బస్సు టికెట్, సినిమా టికెట్ తప్ప ఘటనా స్థలంలో నిందితులకు సంబంధించిన ఆధారాలేవీ లభ్యం కాలేదని వెల్లడించారు. బాధితురాలికి సంబంధించిన మొబైల్ ను కూడా వారు మాయం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసినా, లైంగిక వేధింపులకు పాల్పడినా…చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా వారికి జైలు శిక్షలు విధించేలా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ దిశ యాక్ట్ ను అమల్లోకి తీసుకొచ్చారు. అమ్మాయిలపై నేరాలకు పాల్పడితే శిక్షపడుతుందన్న భయంతోనైనా క్రూరంగా ఆలోచించే మృగాళ్లు తమ ఆలోచనలకు స్వస్తి చెప్తారని అనుకున్నారు చాలామంది. కానీ…ఎన్ని చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఎంత కఠినమైన చట్టాలను తీసుకొస్తే ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉంటాయో మరి..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.