అడవికి తీసుకెళ్లి వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

చిత్తూరు జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. నిమ్మనపల్లె మండలం చల్లావారిపల్లెలో ఓ వివాహితపై కామాంధులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న ఆమెను ముగ్గురు యువకులు అపహరించి బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెపై బలవంతంగా అత్యచారానికి ఒడిగట్టారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు మహేష్‌, విజయ్‌, శివలను అరెస్ట్‌ చేశారు.

మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. సమాజం తలదించుకునేలా మహిళలపై అఘయిత్యాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌ను సైతం లైంగిక వేధింపులకు బ‌లి చేసేస్తున్నారు. ప్ర‌స్తుత‌ కాలంలో నేరాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. ఈ విష‌యం ఇటీవ‌ల పెరుగుతున్న క్రైమ్‌రేట్‌ను గ‌మ‌నిస్తే ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. వాయివ‌రస‌లు మ‌రిచి ఒక‌డు కామాంధుడి అవ‌తార‌మెత్తితే, ప్రియుడి కోసం క‌ట్టుకున్న భ‌ర్త‌ను, క‌న్న బిడ్డ‌ల‌ను చంపుకునే కామాంధురాలు మ‌రొక‌రు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు ప‌దులు.. వంద‌లు కాదు.. వేల సంఖ్య‌లో వెలుగు చూస్తున్నాయి. నిర్భయ, దిశ ఘటనలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇలాంటి హత్యలు, అత్యాచారాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా..కామాంధుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.