డెంగ్యూ జ‌్వరం 15 రోజుల్లో ఆకుటుంబాన్నే మింగేసింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 12:22 PM GMT
డెంగ్యూ జ‌్వరం 15 రోజుల్లో ఆకుటుంబాన్నే మింగేసింది

డెంగ్యూ వ్యాధి ప్రజల్లో దడ పుట్టింస్తోంది. ఆ వ్యాధి పేరు వింటేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లాల్లో డెంగ్యూ దెబ్బకు కుటుంబాలు కుదేలవుతున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానికంగా ప్రజలను కలిచివేస్తుంది. గుడిమల్లు రాజగట్టు కుటుంబానికే జీవనాదారం. ఓ ప్రైవేటు పాళశాలలో ఉద్యోగం చేస్తూ..తాత, భార్యా, కూతురును పోషించుకుంటున్నాడు. అలాంటి పచ్చని కుటుంబంపై డెంగ్యూ మహామ్మారి పగబట్టింది. మొదట రాజగట్టు డెంగ్యూ బారిన పడి మృతి చెందాడు. తర్వాత కొద్ది రోజులకే రాజగట్టు లింగయ్య డెంగ్యూ సోకి మృతి చెందాడు. తండ్రిని, తాతాను మింగేసిన ఆ డెంగ్యూ మహామ్మారి ఆరేళ్ల పాపను కూడ బలితీసుకుంది. ఈ తర్వాత ఇప్పుడు తల్లి సోనా కూడా డెంగ్యూతో.. ఓ మగ బిడ్డకు జన్మనించింది. అనంతరం మృతి చెందింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అయితే 15 రోజుల్లోనే ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ బారిన పడి మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు, బందువులు శోకసంద్రంలో మునిగి పోయారు.

Next Story