కొడుకు ఆఫీసుకి వెళ్లగానే.. తలుపులు వేసుకుని కోడలితో మామ..

సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. వావి వరుసలు మరిచిన ఓ తండ్రి తన కొడుకు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం కొడుకుకి తెలిసి.. వేరు కాపురం పెడతానని పద్దతి మార్చుకోవాలని తండ్రిని హెచ్చరించాడు. కోడలితో కామక్రీడలకు కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి కత్తితో కొడుకును చంపడానికి ప్రయత్నించాడు. చాకచక్యంగా తప్పించుకున్న కొడుకు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ తండ్రి కటకటాలను లెక్కిస్తున్నాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో జరిగింది.

ఫరీదాకోట్‌లో కన్వల్ సింగ్ అనే వ్యక్తి భార్య అనారోగ్యంతో చనిపోయింది. కొడుకు రాజేందర్‌ సింగ్‌కు గతేడాది జస్వీర్ కౌర్ అనే యువతితో వివాహాం జరిగింది. భార్య చనిపోయినప్పటికి నుంచి లైంగిక సుఖానికి పరితపించేవాడు. కొడుకు వ్యాపారం నిమిత్తం బయటికి వెలుతుండడంతో ఇంట్లో మామ, కోడలు మాత్రమే ఉండేవారు. దీంతో అతడి కన్ను కోడలిపై పడింది. ఇంట్లో ఉండే కోడలిని లొంగదీసుకుంటే గుట్టుగా అక్రమ సంబంధం కొనసాగించవచ్చని, ఎవరికీ అనుమానం కూడా రాదని అనుకున్నాడు. దీంతో కొడుకు లేని సమయంలో కోడలితో సన్నిహితంగా మెలిగేవాడు. మాటల సందర్భంలో తన కోరికను తెలియజేశాడు. మామయ్య తన పై ఆశ పడుతున్నాడని తెలుసుకున్న జస్వీర్‌ కౌర్‌ తొలుత షాకైంది. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉండసాగింది. అయితే తన మాటలతో మెల్లిగా తన ముగ్గులోకి దింపాడు.

ఇక కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లడమే ఆలస్యం.. వెంటనే తలుపులు వేసుకుని మామకోడలు కామక్రీడల్లో మునిగితేలేవారు. ఇలా కొన్నాళ్ల వారి బాగోతం గుట్టుగా సాగింది. ఓ రోజు తన తండ్రితో కోడలు సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్నరాజేందర్ పద్ధతి మార్చుకోవాలని తన తండ్రికి, భార్యకి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. అయినా వారు తమ పద్దతిని మార్చుకోలేదు. దీంతో వారికి చెప్పి విసిగిపోయిన రాజేందర్‌ సింగ్‌.. తాను వేరు కాపురం పెడతానని హెచ్చరించాడు. దీంతో కన్వల్‌ సింగ్‌ ఆందోళన చెందాడు. కొడుకు వేరు కాపురం పెడితే.. కోడలితో తన కోరికలు తీర్చుకోవడం కుదరదని భావించాడు. కొడలికి తనకి మధ్య తన కొడుకు అడ్డుగా ఉన్నాడని.. అతడిని అడ్డుతొలగించుకుంటే.. కోడలితో రాసలీలలకు ఎలాంటి అడ్డు ఉండదని భావించాడు. బుధవారం రాత్రి నిద్రపోతున్న రాజేందర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తండ్రి దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న రాజేందర్ సింగ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కన్వల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *