దేశంలో కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొన్ని కొన్ని దారుణాలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంటుంది. తాజాగా తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణం తీవ్ర సంచనలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నర్సింహులు అనే వ్యక్తి తన కుమార్తెపై ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతూ చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఆ బాధ భరించలేక గ్రామంలోని ఆశవర్కర్కు కు చెప్పుకుంది. దీంతో అనుమానం వచ్చిన ఆశ వర్కర్‌ వైద్య పరీక్షలు చేయించగా, రెండు నెలల గర్భవతి అని తెలిపింది. ప్రతి రోజు రాత్రి తల్లి, కొడుకుకు మద్యం తాగించి వారిని పడుకోబెట్టి కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానని కూడా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు పదో తరగతి వరకు చదువుకుని ఇంటి వద్ద ఉంటోంది. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.