హైదరాబాద్ : ESIస్కాంలో మాజీ డైరక్టర్ దేవికారాణితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. చంచల్‌ గూడ జైల్ నుంచి  నిందితులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి దేవికారాణి, పద్మ, వసంత, రాధిక, నాగరాజు, హర్షవర్థన్, శ్రీహరిలను కస్టడీలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి నిందితుల తరలించారు. రెండ్రోజులపాటు నిందితులను విచారించనున్నారు. ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏసీబీ మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశముంది.

కోట్ల రూపాయల  కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే వరుస అరెస్ట్ లు జరుగుతున్నాయి.  అయితే..ఏసీబీ భావిప్తున్న దాని కంటే పెద్దమొత్తంలో కుంభకోణం జరిగిందని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రెండ్రోజుల పాటు ఈఎస్ఐ నిందితులను ఏసీబీ ప్రశ్నించనుంది. మళ్లీ..కస్టడీకి అనుమతించాలా? లేదా? అనేది కోర్ట్  నిర్ణయం తీసుకుంటుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.