బాత్రూమ్‌లో బీటెక్‌ విద్యార్థిని మృతదేహాం.. అసలేం జరిగిందంటే..

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని ఓ లేడీస్‌ హాస్టల్‌లో బీటెక్‌ విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వర్థన్నపేట గ్రామానికి చెందిన జడ అనూష(21) తిమ్మాపూర్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.

కాగా శుక్రవారం కళాశాల ఆమె హాజరుకాకపోవడంతో కళాశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆమెకు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో కంగారు పడిన వారు హాస్టల్‌ నిర్వాహకులకు సమాచారం ఫోన్‌ చేశారు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదని హాస్టల్‌ సిబ్బంది చెప్పారు.

ఓ హాస్టల్‌లో చూడాలని తల్లిదండ్రులు సూచించడంతో.. హాస్టల్ సిబ్బంది అనూష కోసం భవనం పై అంతస్తుకి వెళ్లి చూశారు. గది లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో కిటికీ నుంచి చూసి షాక్‌కు గురయ్యారు. బాత్రూమ్ వద్ద పడిపోయినట్లుగా ఆమె కాళ్లు మాత్రమే కనిపించడంతో కంగారు పడిపోయారు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా బాత్రూమ్‌లో ఆమె చున్నీతో ఉరివేసుకుని కనిపించింది.

చున్నీ జారి ఆమె శరీరం నేలకు తాకింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న హాస్టల్ సిబ్బంది పోలీసులకు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అనూష ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *