అత్యాచారం చేయ‌బోతే.. నాలుక కొరికింది.. దొరికిందిరా దేవుడా అంటూ..

ఇద్ద‌రు దుండ‌గులు ఓ మ‌హిళ‌ను అత్యాచారం చేయ‌బోయారు. అందులో ఒక‌డు ఆమె కాళ్లు ప‌ట్టుకోగా.. మ‌రొక‌డు ఆమెపై ప‌డ్డాడు. ఆ మ‌హిళ భ‌య‌ప‌డ‌కుండా ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకుని అత‌డి నాలుక‌ని కొరికేసింది. దెబ్బ‌కి నాలుక తెగికింద‌ప‌డింది. వెంట‌నే భ‌య‌ప‌డిన ఆకామాంధులు అక్క‌డి నుంచి జారుకున్నారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.

ఆ రోజు ఆదివారం. దేశం మొత్తం జ‌నతా క‌ర్ఫ్యూ పాటించింది. రోడ్ల‌పై ఎవ‌రూ జ‌న‌సంచారం లేదు. రాత్రి ఎనిమిదిన్న‌ర అయ్యింది. జల్పాయ్‌గురిలో ఓ ఇంట్లో ఓ మ‌హిళ‌ టీవీ చూస్తోంది. ఆమె ఇంట్లో ఒంట‌రిగా ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన ఇద్ద‌రు దుండగులు ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించారు.

వాళ్లు అలికిడిని గ‌మ‌నించిన ఆమె ఎవ‌రు మీరు.. ఏం కావాల‌ని అడిగింది. వెంట‌నే ఆ ఆగంత‌కులు తలుపు గ‌డియ పెట్టారు. ఆమె ఆరుస్తుండ‌గానే.. వారిలో ఒక‌డు ఆమె నోరు నొక్కాడు. మరొకడు ఆమెను కాళ్లను ప‌ట్టుకున్నాడు. ఇద్దరూ చెరోవైపూ పట్టుకొని… ఆమెను బెడ్ రూంలోకి లాక్కుపోయారు.

ఆమెకు అరిచే అవ‌కాశం లేదు. ఆమె మనసులో ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో భయాలు, చెప్పలేనంత టెన్షన్. స‌డెన్ గా అందులో ఒకడు ఆమె కాళ్ల‌ను ప‌ట్టుకున్నాడు. మ‌రొక‌డు ఆమెను ముద్దు పెట్టుకోవాల‌ని చూశాడు. ఆమె ఎంత గింజుకున్నా వ‌దల్లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డానికి ఆ కామాంధుడి నాలుక‌ను గ‌ట్టిగా కొరికేసింది. దెబ్బ‌కి వాడి నాలిక తెగి కింద‌ప‌డింది. అంతే… వాడు కెవ్వు కేక పెట్టాడు. అది చూసిన మరొకడు.. వామ్మో నాయనో వద్దురా బాబో అంటూ పారిపోయాడు.

కాగా నాలుక తెగి కింద‌ప‌డింది. పారిపోదామంటే.. నాలిక లేద‌నే టెన్ష‌న్‌. నాలిక కోసం అటూ ఇటూ వెతికాడు. దుప్పట్లో ఓ మూల అది కనిపించింది. దాన్ని దొరికిందిరా దేవుడా అంటూ ప‌రుగు లంకించుకున్నాడు. జల్పాయ్‌గురి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి వెళ్లాడు. డాక్టర్లు అతనికి నాలికను సర్జరీ చెయ్యలేకపోయారు. అప్పటికే చాలా ఆలస్యమైందనీ, తెగిన ముక్క పాడైపోయినందువల్ల దాన్ని సెట్ చెయ్యలేమని చెప్పారు. తర్వాత అతన్ని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు పంపారు. వాళ్లిద్ద‌రు కూడా స్థానికులే అని పంచాయ‌తీ మెంబ‌ర్ రంజిత్ రాయ్ తెలిపారు. వాళ్లకు కఠిన శిక్షలు వెయ్యాలని కోరారు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *