8వ తరగతి విద్యార్థినిపై హాస్టల్‌ వార్డెన్‌.. ఇంట్లో నిర్బంధించి మరీ..

తూర్పు గోదావరి జిల్లాలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై హాస్టల్‌ కీచక వార్డెన్‌ అత్యచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన వై.రామవరం మండలం డొంకరాయి గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో లక్ష్మణరావు అనే వ్యక్తి హాస్టల్‌ వార్డెన్‌ పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై కన్నేశాడు. ఎలాగైన బాలికను నిర్భంధించి అత్యచారానికి ఒడిగట్టాలని లక్ష్మణ్‌రావు ప్లాన్‌ వేసుకున్నాడు.

పథకం ప్రకారం బాలికను బలవంతంగా ఇంట్లో నిర్బంధించాడు. అనంతరం బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పుతూ బోరున విలపించింది. తనపై వార్డెన్‌ చేసిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన సమాజంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైంది. విచక్షణ మరచి అత్యచారాలకు తెగబడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో ఓ బాలిక ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. షాప్‌కు వచ్చిన బాలికను కారులో ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.