అయోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు: ప్రధాని మోదీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 7:35 AM GMT
అయోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు: ప్రధాని మోదీ

ఢిల్లీ: అయోధ్య విషయంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యాలు చేయ్యేద్దని మోదీ కేంద్ర మంత్రులకు హితువు పలికారు. అయితే రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు కొద్ది రోజుల్లో తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తెలిపారు. అయితే ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికీ శాంతి, సామరస్యాలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2010లో ఆలహాబాద్‌ కోర్టు తీర్పును ప్రజలు ఎలా గౌరవించారో..ఇప్పుడు కూడా.. ప్రజలు అలాగే గౌరవించాలన్నారు. ముఖ్యంగా కోర్టు తీర్పు వెలువరిచిన అనంతరం తీర్పును, తీర్పుగానే చూడాలి..కాని గెలుపు ఓటమి ప్రస్తావన అసలే రావొద్దని అన్నారు.

మరో వైపు అయోధ్య కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధిస్తూ జిల్లా మేజిస్ట్రేట్‌ అదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగొయి నేతృత్వంలో అయోధ్య కేసు ఐదుగురు సభ్యుల ధర్నాసనంలో పెట్టిన విషయం తెలిసిందే.

Next Story