ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన ఐదు నెల‌ల‌కే కూతురు పుట్టింది. దీంతో అత‌ని ఆనందానికి అవ‌ధులు లేవు. ఆనందంగా సాగిపోతుంది జీవితం. అయితే ఓ రోజు షాకింగ్ తెలిసింది. త‌న కూతురికి తాను తండ్రిని కాద‌ని, అందుకు ఓ 13 ఏళ్ల బాలుడు అని తెలిసి విషాదంలో మునిగిపోయాడు.

యూకేకి చెందిన డానియెల్ రాబిన్స్, లేహ్ కార్డిస్ ప్రేమించుకున్నారు. లేహ్ కార్డిస్ ఓ బేబీకేర్ సెంటర్‌లో పనిచేసేది. కొద్దికాలం తర్వాత డానియెల్‌కి బ్రేకప్ చెప్పి దూరంగా ఉంది. ఈ క్రమంలో ఆమెకి 13 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. బాలుడితో లేహ్ రహస్యంగా శృంగారంలో పాల్గొనేది. మళ్లీ కొద్దికాలం తర్వాత డానియెల్‌తో రిలేషన్ పెంచుకుంది. అటు బాలుడితో.. ఇటు బాయ్‌ఫ్రెండ్‌‌తో ఇద్దరితోనూ రొమాన్స్ చేసేది. బాలుడితో రాసలీలల విషయం బాయ్‌ఫ్రెండ్‌కి తెలియకుండా జాగ్రత్తపడింది. ఫలితంగా గర్భం రావడంతో బాయ్‌ఫ్రెండ్‌కి చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరడంతో అతను సరేనన్నాడు. నాలుగు నెలల గర్భిణిగా ఉండగా కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

వివాహమైన ఐదు నెలలకి వారికి పాప పుట్టింది. పాప పుట్టిన దగ్గర్నుంచి డానియెల్ ప్రపంచమే మారిపోయింది. కూతురిపై అమితమైన ప్రేమ కురిపించేవాడు. సడెన్‌గా అతనికి మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తెలిసింది. లేహ్‌పై చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల అభియోగాలు నమోదయ్యాయి. విచారణలో భాగంగా లేహ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడిందని.. తనను గదిలోకి తీసుకెళ్లి ప్యాంట్ విప్పేసి శృంగారం కోసం ప్రాదేయ‌ప‌డేద‌ని బాలుడు చెప్పాడు. దీంతో కోర్టు డీఎన్‌ఏ టెస్టుకు ఆదేశించింది.లేహ్ కూతురికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయడంతో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. ఆమె కూతురికి అసలు తండ్రి 13 ఏళ్ల బాలుడేనని తేలింది. తన కూతురికి అసలు తండ్రి బాలుడని తెలియడంతో లేహ్ భర్త డానియెల్ కంగుతిన్నాడు.

తన భార్య, పాప కోసం ఎన్నో కలలు కన్నానని.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అయితే తన భార్య చెడ్డది కాదంటూ డానియెల్ వెనకేసుకురావడం కొసమెరుపు.ఆమెపై ఉన్న నేరాభియోగాలు నిరూపితమవడంతో కఠిన శిక్ష పడే అవకాశాలున్నాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.