ఏపీలో 53 శాతం పెరిగిన సైబర్ నేరాలు..!
By అంజి Published on 29 Dec 2019 5:52 PM ISTగుంటూరు: రాష్ట్రంలో 53 శాతం సైబర్ నేరాలు పెరిగాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆదివారం నాడు 2019 వార్షిక నివేదికను డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు. పోలీస్ శాఖలో మార్పుకు శ్రీకారం చుట్టామని, సమర్థవంతంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని తెలిపారు. వృత్తిపరమైన పోటీల్లో దేశ స్థాయిలో ఏడు అవార్డులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 2018తో 2019 సంవత్సరాన్ని పోల్చితే కొన్ని కేసులు బాగా పెరిగాయని, మరికొన్ని కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. రోడ్డు ప్రమాదాలు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా ఉండటం బాధాకరమని చెప్పారు.
పోలీస్ సంక్షేమంలో భాగంగా వీక్లీ ఆఫ్ చరిత్రాత్మకంగా నిలిచిందన్నారు. ఇసుక పాలసీ వలన ఇసుక చోరీ కేసులు 140 శాతం పెరిగాయని, మహిళ భద్రత కోసం అనే అవగాహన కార్యక్రమాలు చేపట్టామని డీజీసీ సవాంగ్ పేర్కన్నారు. దిశ యాక్ట్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. మోసాలు, రేప్‌లు, వేధింపుల కేసులు, పోస్కో కేసులు అధికమయ్యాయని డీజీసీ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టి 2020లో నేరాల సంఖ్య తగ్గించి సేఫ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల సహకారంతో నక్సలిజం చర్యలు తగ్గుముఖంకు చర్యలు చేపడున్నట్టు తెలిపారు.